Breaking News
  • దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభన గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24, 879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 487 మంది మృతి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 7, 67, 296 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 2, 69, 789 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 4, 76, 378 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21, 129 మంది మృతి.
  • విజయవాడ: ఈ నెల 20 నుంచి ప్రథమ్ మొబైల్ యాప్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు జారీ. నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ ని ప్రారంబించాలని ఆర్టీసీ నిర్ణయం. తొలుత ప్రయోగాత్మకంగా 19 డిపోల పరిధిలో మొబైల్ యాప్ ద్వారా టికెట్ల జారీ చేయాలని ఎండీ నిర్ణయం.
  • వికాస్ దూబే అరెస్టు వ్యవహారంలో కొత్త కోణాలు. కులాభిమానంతో వికాస్ దూబేకు ఓ ఎంపీ సహకారం. మధ్యప్రదేశ్‌కు చెందిన ఎంపీ సహాయంతో లొంగుబాటు. ఎన్‌కౌంటర్ నుంచి తప్పించేందుకే సహకారం.
  • పెరుగుతున్న కరోనాకేసుల్తో మార్కెట్లలో బెంబేలు . ఈనెల 12వ తేదీ నుండి కొత్తపేట్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను మూసివేత నిర్ణయం. మళ్లీ ప్రకటించే వరకూ రైతులు ఎవరు మార్కెట్ రావద్దని ప్రకటన. వేల సంఖ్యలో రైతులతో కిటకిట లాడే మార్కెట్లో నిబంధనలు పాటించడంలేదంటూ ఆందోళన. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో మూసివేత నిర్ణయం తీసుకున్న కమిటి. ప్రతి రోజు 5వందల నుంచి వేయి టన్నుల పండ్ల అమ్మకాలు . 250 మంది వ్యాపారులు...3వందల మంది హమాలీలతో ఉన్న గడ్డి అన్నారం మార్కెట్.
  • నిమ్స్ లోని నెఫ్రాలజీ లో డయాలసిస్ పేషెంట్స్ ఆందోళన. డయాలసిస్ చేయడం లేదంటూ నిమ్స్ వద్ద నిరసన . డయాలసిస్ కోసం పేర్లు కూడా రిజిస్టర్ చేసుకోవడం లేదు అంటూ ఆందోళన . గంటలు తరబడి లైన్లో నిలుచున్నా పట్టించుకునే వారు లేరంటూ ఆవేదన . వారానికి నాలుగు సార్లు చేయవలసిన డయాలసిస్ మూడు సార్లే చేస్తున్నారు. 4 గంటలు నిర్వహించాల్సిన డయాలసీస్ 3 గంటలే చేస్తున్నారంటున్న పేషంట్లు . సకాలంలో డయాలసీస్ చేయకపోతే ప్రాణాలు పోతాయంటూ ఆందోళన.
  • తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన: దక్షిణ ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాలలో 3.1 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు చాలా చోట్ల, ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. సంచాలకులు హైదరాబాద్ వాతావరణ కేంద్రం

బిగ్‌బీకి దాదా సాహెబ్ ఫాల్కే!

Veteran actor Amitabh Bachchan receives Dadasaheb Phalke Award, బిగ్‌బీకి దాదా సాహెబ్ ఫాల్కే!

బాలీవుడ్ కింగ్ అమితాబ్ బచ్చన్ భారత చలన చిత్ర సీమలో గౌరవప్రదమైన, అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. భారతీయ సినిమా రంగానికి విశిష్టసేవలు అందించినందుకు గానూ.. బిగ్‌బీకి ఈ పురస్కారం లభించింది. అవార్డు అందకుంటున్న సమయంలో ఆయన వెంట భార్య జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అమితాబ్‌ను కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ అభినందిస్తూ ట్వీట్ చేశారు.

కాగా.. అమితాబ్ మాట్లాడుతూ.. అవార్డు అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే నిజానికి ఆయన అవార్డును డిసెంబర్ 23వ తేదీనే అందుకోవాలి. అప్పుడు అనారోగ్యంగా ఉన్నందున అమితాబ్ ఈ రోజున తీసుకున్నారు. కాగా.. ఈనెల 23వ తేదీన జాతీయ అవార్డులు అందుకున్న వారందరికీ రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు.

Related Tags