వీడొక జఫ్ఫా అని తిడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే మరి..

జఫ్పా.. ఈ మట వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది కమెడియన్ బ్రహ్మానందమే. ఆయన ఈ జఫ్పా పదానికి అంత ప్రాచుర్యాన్ని కల్పించారు. ఎవరినైన సరదాగానో, చులకనగానో మాట్లాడే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ మాట విన్న వెంటనే దాన్ని తిట్టుగానే తీసుకుంటారు. కానీ అది ఓ పదార్ధానికి ఉన్న పేరు అనే విషయం చాల మందికి తెలియదు. ఇది ఇండియాకు చెందిన పదార్ధం అసలు కానేకాదు. అసలు ఈ జఫ్పా పదార్ధం అంటే ఏమిటో తెలుసుకుందాం. […]

వీడొక జఫ్ఫా అని తిడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే మరి..
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 5:19 AM

జఫ్పా.. ఈ మట వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది కమెడియన్ బ్రహ్మానందమే. ఆయన ఈ జఫ్పా పదానికి అంత ప్రాచుర్యాన్ని కల్పించారు. ఎవరినైన సరదాగానో, చులకనగానో మాట్లాడే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ మాట విన్న వెంటనే దాన్ని తిట్టుగానే తీసుకుంటారు. కానీ అది ఓ పదార్ధానికి ఉన్న పేరు అనే విషయం చాల మందికి తెలియదు. ఇది ఇండియాకు చెందిన పదార్ధం అసలు కానేకాదు. అసలు ఈ జఫ్పా పదార్ధం అంటే ఏమిటో తెలుసుకుందాం.

తెలుగు సినిమాల్లో కామెడీని పండించడానికి పలు పదాలు పట్టించడం సహజంగా జరిగేదే. అలా పుట్టిందే జఫ్ఫా అనే పదం. కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో మరో కమెడియన్ వెన్నెల కిషోర్ ఏకంగా ఈ పేరుతో సినిమానే తీశాడు. అయితే అది అట్టర్ ప్లాప్ అయ్యిందనేవిషయం తెలిసిందే.

ఇంతకీ ఈ జఫ్ఫాఅనే పదం ఎక్కడిది, ఏ దేశానికి చెందిందో తెలుసుకుందాం. ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఓ పోర్టు సిటీకి ఉన్నపేరు. జఫ్ఫా అనే పేరుతో ఏకంగా ఒక నగరమే ఉందనే విషయం మనకు తెలియకపోవచ్చు కానీ ఇది నిజం.

ఇదిలా ఉంటే ఈ జఫ్ఫ అనే పేరుతో ఒక కేక్ కూడా ఉంది. హాలోవీన్, క్రిస్మస్ వేడుకల్లో కట్ చేయడానికి కో ఆంట్రిమ్‌లోని ఓ చిప్స్ షాపులో దీన్ని కనిపెట్టారు. దీని ప్రత్యేకత ఏమిటంటే కప్ కేక్‌లో చాక్లెట్ క్రీమ్‌ను పెట్టి దాన్ని నూనెలో వేయిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల దీనికి ఒక కొత్త రుచి వస్తుంది. ఈ కేక్‌ రుచికి స్ధానిక కొనుగోలు దారులనుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే పండుగల సమయంలో దీన్ని చిప్స్ షాపునకు వచ్చే కస్టమర్లకు ఉచితంగా దీన్ని అందించడం వారికి ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ జఫ్ఫా కేక్‌ పట్ల కో ఆంట్రిమ్‌లో ఉన్న కస్టమర్లు విపరీతంగా దీన్ని లైక్ చేస్తున్నారట. చూశారా.. మనం వాడే ఓ చిన్న పదంతో ఓ పోర్టు సిటీతో పాటు, తినే కేక్‌‌కు కూడా లింక్ ఉందంటే ఆశ్చర్యమే కదా!