అంతర్జాతీయ క్రికెట్‌కి వేణుగోపాల్ రావు గుడ్ బై!

తెలుగు క్రికెటర్ వై వేణుగోపాల్ రావు అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు .. 37 ఏళ్ల వేణుగోపాల్ రావు 2005 లో టీమిండియాకు జట్టుకు ఎంపికయ్యాడు.. తన క్రికెట్ కెరియర్ లో భారత క్రికెట్టు జట్టు తరపున 18 వన్డేలు ఆడాడు. అత్యదికంగా 61 పరుగులు చేసాడు. 121 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడాడు .. ఇక ఐపీఎల్ లో 2008–2010 మధ్యకాలములో డెక్కన్ చార్జర్స్ తరపున, 2011-2013 మధ్యకాలములో ఢిల్లీ డేర్ డెవిల్స్ […]

అంతర్జాతీయ క్రికెట్‌కి వేణుగోపాల్ రావు  గుడ్ బై!
Follow us

|

Updated on: Jul 31, 2019 | 5:11 AM

తెలుగు క్రికెటర్ వై వేణుగోపాల్ రావు అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు .. 37 ఏళ్ల వేణుగోపాల్ రావు 2005 లో టీమిండియాకు జట్టుకు ఎంపికయ్యాడు.. తన క్రికెట్ కెరియర్ లో భారత క్రికెట్టు జట్టు తరపున 18 వన్డేలు ఆడాడు. అత్యదికంగా 61 పరుగులు చేసాడు. 121 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడాడు .. ఇక ఐపీఎల్ లో 2008–2010 మధ్యకాలములో డెక్కన్ చార్జర్స్ తరపున, 2011-2013 మధ్యకాలములో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడాడు. ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్న వేణుగోపాల్ రావు ఐపీఎల్ లో వాఖ్యాతగా కొనసాగుతున్నాడు . ఇక ఇండియన్ టీంలో వేణుగోపాల్ ఆడే అవకాశాలు లేకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వేణుగోపాల్ రావు జనసేన తీర్దం పుచ్చుకున్నాడు, కానీ పోటి చేయలేదు . సెలక్షన్ కమిటీ ఛైర్మన్ msk ప్రసాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్ తరుపున ఇండియా టీంకు ప్రాతినిధ్యం వహించిన రెండవ క్రికెటర్ వేణుగోపాల్ రావు.