Breaking News
  • భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కరోనాపై పోరులో భారత్‌ చేయాల్సిందంతా చేస్తోంది. సాయం చేయడానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటాం-ప్రధాని మోదీ.
  • ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు. కరోనాపై యుద్ధంలో భారతీయుల కృషి అభినందనీయం. భారత ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు-ట్రంప్‌ ట్వీట్‌.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో గుండెపోటుతో వ్యక్తి మృతి. ఇటీవల కరోనాతో చనిపోయిన వ్యక్తికి సోదరుడు కావడంతో.. స్థానికుల్లో పలు అనుమానాలు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలింపు. శాంపిల్స్‌ పరీక్షించే వరకు మృతదేహం ఇవ్వమంటున్న అధికారులు.
  • తెలంగాణలో డయల్‌ 100కు పెరుగుతున్న కాల్స్‌. లాక్‌డౌన్‌ తర్వాత డయల్‌ 100కు 13,34,330 కాల్స్‌. ఎమర్జెన్సీ కాల్స్‌-82,014. కోవిడ్‌ సస్పెక్ట్ కాల్స్‌- 2,710. లాక్‌డౌన్‌ కాల్స్‌-21,758. ఇన్‌ ఎఫెక్టివ్‌ కాల్స్‌-87,665. విచారణ కోసం చేసిన కాల్స్‌- 84,123. తగ్గిన చోరీలు, గృహ హింస, రోడ్డుప్రమాదాల కాల్స్‌.
  • తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్రైమ్‌రేట్‌ భారీగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రైమ్‌రేటు 56 శాతానికి పడిపోవడం ఊరటనిస్తోంది. లాక్‌డౌన్‌తో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి.

‘వెంకీ మామ’ రివ్యూ.. మామా అల్లుళ్లు ఏ మాత్రం మెప్పించారంటే..!

Venky Mama review, ‘వెంకీ మామ’ రివ్యూ.. మామా అల్లుళ్లు ఏ మాత్రం మెప్పించారంటే..!

నిర్మాణ సంస్థలు: సురేష్‌ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు: వెంకటేష్‌, అక్కినేని నాగచైతన్య, రాశీ ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌, ప్రకాష్‌రాజ్‌, నాజర్‌, పరగ్‌ త్యాగి, సంపత్‌ రాజ్‌, రావు రమేష్‌, పోసాని కృష్ణ మురళి, చమ్మక్‌ చంద్ర, గీత, విద్యుల్లేఖ రామన్‌, దాసరి అరుణ్‌ కుమార్‌, హైపర్‌ ఆది తదితరులు
దర్శకత్వం: కె.ఎస్‌.రవీంద్ర
నిర్మాతలు: డి. సురేష్‌ బాబు, టీజీ విశ్వప్రసాద్‌
రచన: కె. జనార్దన్‌ మహర్షి, కె.ఎస్‌.రవీంద్ర, కోన వెంకట్‌
సంగీతం: ఎస్‌. ఎస్‌ .తమన్‌
కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల
ఎడిటింగ్: ప్రవీణ్‌ పూడి
విడుదల: 13 డిసెంబర్‌ 2019

కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడూ ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. అలాంటి ఓ కాంబినేషన్‌ వెంకీమామతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమ్మయినా, నాన్నయినా నువ్వేలే వెంకీమామా అని చైతూ పాటలో వేసిన స్టెప్స్ ఫ్యామిలీ ఆడియన్స్ గుండెలను తట్టిలేపాయి. రియల్‌ లైఫ్‌ మామా అల్లుళ్లు వెంకటేష్‌ దగ్గుబాటి, నాగచైతన్య అక్కినేని కలిసి చేసిన సినిమా స్క్రీన్స్ మీద కూడా అంతే సందడి చేసిందా? మామా అల్లుళ్లలో ఎవరు ఎవరికి పోటీనిచ్చారు? ఎవరు ఎవరికి స్పేస్‌ ఇచ్చారు? రాశీ, పాయల్‌ స్క్రీన్‌ మీద ఎలాంటి సందడి చేశారు? ఇంత మంది ఆర్టిస్టులను దర్శకుడు బాబీ బాగానే డీల్‌ చేశాడా? నిర్మాతలు పెట్టిన ఖర్చు కనిపిస్తోందా? అసలు సినిమా కథేంటి?

కథ:

మిలిటరీ నాయుడు (వెంకటేష్‌) గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరిలో ఉంటాడు. తన సోదరి, బావా చనిపోవడంతో వాళ్ల పిల్లాడిని కంటికి రెప్పలా పెంచి కాపాడుతాడు. పెరిగి పెద్దయిన కార్తీక్‌ శివరామ్‌ వీరమాచినేని (నాగచైతన్య) మామ బాటలోనే నడుస్తుంటాడు. తెలివితేటలతో ఫారిన్‌ వెళ్లే ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు. అయితే మామకు దూరంగా ఉండాలనే ఆలోచనను తట్టుకోలేక, ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకుంటాడు. ఉద్యోగాన్నే కాదు… మనసారా ప్రేమించిన హారిక (రాశీ ఖన్నా)ను కూడా పక్కన పెట్టేస్తాడు. తనకోసం తన మామ పెళ్లి చేసుకోలేదని తెలుసుకుంటాడు. వాళ్ల ఊరికి కొత్తగా వచ్చిన హిందీ టీచర్‌ (పాయల్‌ రాజ్‌పుత్‌)తో ఎలాగైనా మామకు పెళ్లి చేయాలని సంకల్పించుకుంటాడు. అల్లుడు ఆ పనిలో ఉండగానే, మామకు హారిక విషయం తెలుస్తుంది. అల్లుడితో హారికను కలపాలని మామ, మామకు జోడీని వెతికి పెట్టాలని అల్లుడు చేసే ప్రయత్నాలు ఏంటి? మధ్యలో ఎమ్మెల్యే ఎవరు? అతను కార్తిక్‌ ను ఎందుకు చంపాలనుకుంటాడు? అసలు మిలిటరీ నాయుడు తండ్రికి కార్తిక్‌ను చూస్తే ఎందుకు పడదు? మేనమామ కనుసన్నల్లో కంటిపాపగా ఎదిగిన కార్తీక్ మిలిటరీకి ఎందుకు వెళ్తాడు? బస్సు చక్రాల కింద, రైలు చక్రాల కింద పడి చనిపోయే జీవితాలు ఉంటాయి కానీ… జాతక చక్రాల కింద నలిగిన ఈ మామాఅల్లుళ్ల కథేంటి? జాతకాలను నిర్దేశించే గ్రహాలు గొప్పవా? మనుగడకు పనికొచ్చే ప్రేమానురాగాలు గొప్పవా? మామా అల్లుళ్ల కథ చివరి మజిలీ ఎక్కడ? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

పాటలు, టీజర్‌, ట్రైలర్‌ ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో సినిమా కూడా అలాగే ఉంది. గోదావరి జిల్లాలో ఓ ఎగువ మధ్యతరగతి కుటుంబం, అందులో జాతకాలను నమ్మే తండ్రి, ఆ కుటుంబంలో నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి… విధిని ఎదిరించి, హేతువాదాన్ని నమ్మే సోదరుడు… ఇలా మొదలవుతుంది సినిమా. అందరూ అనుకున్నట్టు ఇందులో వెంకటేష్‌ సింగిల్‌ గెటప్‌ కాదు.. రెండు, మూడు గెటప్పుల్లో అలరిస్తాడు. చిన్న పిల్లాడిని అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసే మేనమామగా ఆయన నటన బావుంది. లోకల్‌ ఎమ్మెల్యేగా, పదవి కోసం ఏమైనా చేసే వ్యక్తిగా రావు రమేష్‌ నటించారు. బ్రిగేడర్‌గా ప్రకాష్‌రాజ్‌ చేశారు. ఓ వైపు మేనమామ ప్రేమను అర్థం చేసుకుంటూ, మంచీ చెడు తెలిసిన కుర్రాడిగా, తన వయసుకు తగ్గట్టు ప్రవర్తించే యువకుడిగా నాగచైతన్య మెప్పించాడు. మేనల్లుడిగా, మిలిటరీ పర్సన్‌గా నాగచైతన్య గెటప్పులు, నటనలో ఈజ్‌ బావున్నాయి. ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఇంకాస్త ఎక్స్ ప్రెషెన్స్ మెరుగు పడాలనే మాటలు థియేటర్లో వినిపించాయి.

పల్లెటూరికి వచ్చిన షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా రాశీ కనిపించింది. గత సినిమాలతో పోలిస్తే ఇందులో రాశీ కాస్ట్యూమ్స్ మరింత గ్లామర్‌గా ఉన్నాయి. హిందీ టీచర్‌గా పాయల్‌ నటించింది. వెంకటేష్‌ – రాశీఖన్నా మధ్య వచ్చే సన్నివేశాలు బాగానే ఉన్నాయి. నాగచైతన్య – పాయల్‌ మధ్య నడిచే సన్నివేశాలు కూడా కొత్తగానే ఉన్నాయి. ఈ నలుగురి మధ్య సీన్స్ ని బాగానే డీల్‌ చేశాడు డైరక్టర్‌ బాబీ. అక్కడక్కడా హైపర్‌ ఆది, చమ్మక్‌ చంద్ర, విద్యుల్లేఖ రామన్‌ చెప్పే మాటలతో నవ్వులు కూడా తెప్పించారు. సర్జికల్‌ స్ట్రైక్‌ చేసే సన్నివేశాలు, కాశ్మీర్‌ ఎపిసోడ్‌, జాతరలో రంగుల ఫైట్లు కూడా బావున్నాయి. అమ్మయినా నాన్నయినా నువ్వేలే వెంకీమామా అనే పాట, కోకోకోలా పెప్సీ పాట బావున్నాయి.

ఎన్నాళ్లకో, ఎన్నాళ్లకో రెట్రో సాంగ్‌. సినిమా ఫస్టాఫ్‌ అంతా సరదా సరదాగానే సాగిపోతుంది. సెకండాఫ్‌ అదే వేగంతో సాగదు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఓ టెర్రరిస్టును అప్పగించి, మన మిలిటరీ ఆఫీసర్‌ని తీసుకొచ్చుకునే సందర్భాన్ని ఇంకాస్త లోతుగా చూపించాల్సింది. హై టెన్షన్‌తో సాగే అలాంటి సందర్భాన్ని అటో పది మంది, ఇటో పది మందితో చేయడం వల్ల తేల్చినట్టు అనిపించింది. అయితే ఎయిర్‌ ఆంబులెన్స్ లో ‘అన్నీ నేర్పిన వెంకీమామ, తాను లేకుండా ఎలా బతకాలో నేర్పలేద’ని చైతన్య చెప్పిన డైలాగ్‌ బావుంది. అయినప్పటికీ క్లైమాక్స్ ఇంకా బావుండాల్సిందనే ఫీలింగ్‌ మాత్రం ఆడియన్స్ కి కలుగుతుంది. మామా అల్లుళ్లను స్క్రీన్‌ మీద చూసుకోవాలనుకునే ఫ్యాన్స్ కి మాత్రం ఫెస్టివల్‌ లాంటి సినిమా. కానీ వాళ్లిద్దరి మీద ఎక్కువ ఫోకస్‌ పెట్టడం వల్ల రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, నాజర్‌ వంటి ఆర్టిస్టులున్నా వారిని సరిగా వాడుకోలేకపోయారేమోననే భావన కలిగి తీరుతుంది.

ఆఖరి వాక్యం: మామ… ఫ్యామిలీ పర్సన్‌!
– డా. చల్లా భాగ్యలక్ష్మి

Related Tags