వెంకీ మరో మల్టీస్టారర్ వార్తలు ఉత్తివేనా..!

వెంకటేశ్ మరో మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడన్న వార్త ఇటీవల హల్‌చల్ చేసింది. ఈసారి మాస్‌రాజా రవితేజతో కలిసి వెంకటేశ్ నటించనున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. అనిల్ సుంకర నిర్మించనున్న ఈ చిత్రానికి వీరుపోట్ల దర్శకత్వం వహించనున్నట్లు పలు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

అనిల్ సుంకరతో వెంకటేశ్ ఓ సినిమాను చేయాల్సి ఉంది. అనిల్ రెఫరెన్స్‌తో వీరుపోట్ల, వెంకటేశ్‌కు ఇటీవల ఓ కథను చెప్పారు. అయితే ఈ కథకు వెంకటేశ్ ఇంకా తన స్పందనను తెలపలేదట. అయితే అంతలోపే వెంకటేశ్ మరో మల్టీస్టారర్‌కు సిద్ధమైనట్లు గాసిప్స్ వినిపించాయి. ప్రస్తుతం వెంకటేశ్, నాగచైతన్యతో కలిసి వెంకీ మామలో నటిస్తుండగా.. తదుపరి చిత్రంపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *