చిన్నోడు,పెద్దోడు ఛలో బ్రిటన్..!

టాలీవుడ్ సెలెబ్రిటీస్‌లో క్రికెట్‌ను ఇష్టపడేవాళ్ళలో మొదటి వరుసలో ఉంటాడు హీరో విక్టరీ వెంకటేష్. ఇండియా కానీ సన్‌రైజర్స్ మ్యాచ్‌లు గానీ ఎప్పుడు ఎక్కడ జరిగినా వాలుతాడు. ఇక క్రికెట్ అంటే మన మహర్షి మహేష్ బాబుకి కూడా ఇష్టమే కానీ దాన్ని ఇలా ప్రదర్శించడం చాలా తక్కువ. వీరిద్దరూ కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ద్వారా ‘పెద్దోడు చిన్నోడు’గా జనాలకు బాగా దగ్గరయ్యారు. కాగా ఈ హీరోలిద్దరూ త్వరలోనే ఇంగ్లాండ్ వెళ్ళబోతున్నారని తెలుస్తోంది.

ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌లో ఐసీసీ వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. అందులో ఇండియా అదే మ్యాచ్‌లు అన్ని చూసేందుకు ఈ హీరోలిద్దరూ వెళ్లనున్నట్లు సమాచారం. నిర్మాత సురేష్ బాబు కూడా ఈ బృందంలో ఉంటారట. ఇండియా ఆడే అన్ని లీగ్ మ్యాచ్‌లు చూసి.. ఒక వేళ సెమీస్‌కు చేరితే టూర్‌ను కొనసాగించాలని చూస్తున్నారట. దానికి అనుగుణంగా వెంకటేష్ తన వెంకీ మామ షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకున్నారని వినికిడి.

అటు మహేష్ బాబు రీసెంట్‌గా మహర్షి‌తో పెద్ద సక్సెస్ సాధించాడు. అనిల్ రావిపూడి సినిమా మొదలుపెట్టడానికి కూడా కొంత టైం ఉంది కాబట్టి హ్యాపీగా మ్యాచ్‌లు ఎంజాయ్ చేయొచ్చు అని భావిస్తున్నాడట . సో త్వరలోనే చిన్నోడు, పెద్దోడిని కలిపి క్రికెట్ గ్రౌండ్‌లో మనం చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *