మరో మల్టీస్టారర్‌లో వెంకీ.. రెండో హీరో ఎవరంటే..!

తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ విక్టరీ వెంకటేష్ కొనసాగుతున్నారు. స్టార్, యంగ్ అన్న బేదాభిప్రాయం లేకుండా కథ నచ్చితే ఏ హీరోతోనైనా నటించేందుకు వెంకటేశ్ మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల’, ‘ఎఫ్‌ 2’, ‘మసాలా’ వంటి మల్టీస్టారర్‌లలో నటించిన వెంకీ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మరో మల్టీస్టారర్‌ కోసం వెంకీని సంప్రదించినట్లు తెలుస్తోంది.

‘రగడ’, ‘బిందాస్’ చిత్రాల దర్శకుడు వీరుపోట్ల ఇటీవల వెంకటేశ్‌కు ఓ కథను చెప్పారట. అది విన్న వెంకీ ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో మరో హీరోగా మాస్‌రాజా రవితేజ ఫైనల్ అయినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మరో క్రేజీ కాంబోను టాలీవుడ్ ప్రేక్షకులు చూడనున్నారు. ఇదిలా ఉంటే వెంకీమామ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *