వేద పాఠశాల పూర్వ అధ్యాపకులు ఇక లేరు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సంస్కృత, వేద పాఠశాల పూర్వ అధ్యాపకులు కొడిచెర్ల పాండురంగాచార్యస్వామి పరమపదించారు. సుదీర్ఘ కాలం ఉపన్యాసకులుగా పనిచేసిన ఆయన వేదాంత పండితుడిగా.. వేద శ్రాస్త్ర పారంగతుడిగా.. ఎంతో మందికి వేద విద్యను అందించారు. పాండురంగాచార్యస్వామి మృతి పట్ల సాహిత్య సంస్కృత, వేదపండితలు సంతాపం తెలిపారు. మహబూబ్‌నగర్‌కు చెందిన స్వామి 20 ఏళ్లపాటు మైసూర్‌కు చెందిన పరకాల మఠం 33వ జీయర్ స్వామి వద్ద వేదాలు, శాస్త్రాలు అధ్యయనం చేశారు. పాండురంగాచార్యను కొన్నేళ్ల కిందట […]

వేద పాఠశాల పూర్వ అధ్యాపకులు ఇక లేరు
Follow us

|

Updated on: May 26, 2020 | 1:23 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సంస్కృత, వేద పాఠశాల పూర్వ అధ్యాపకులు కొడిచెర్ల పాండురంగాచార్యస్వామి పరమపదించారు. సుదీర్ఘ కాలం ఉపన్యాసకులుగా పనిచేసిన ఆయన వేదాంత పండితుడిగా.. వేద శ్రాస్త్ర పారంగతుడిగా.. ఎంతో మందికి వేద విద్యను అందించారు. పాండురంగాచార్యస్వామి మృతి పట్ల సాహిత్య సంస్కృత, వేదపండితలు సంతాపం తెలిపారు. మహబూబ్‌నగర్‌కు చెందిన స్వామి 20 ఏళ్లపాటు మైసూర్‌కు చెందిన పరకాల మఠం 33వ జీయర్ స్వామి వద్ద వేదాలు, శాస్త్రాలు అధ్యయనం చేశారు. పాండురంగాచార్యను కొన్నేళ్ల కిందట కరీంనగర్‌లో జరిగిన యజ్ఞ వరాహ క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా ఆహ్వానించి విశిష్ఠ సత్కారం అందించారు.