ఏం కొనేటట్టు లేవుగా..!

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. మార్కెట్‌లో ధరలు మండుతోన్నాయి. ప్రధానంగా జిల్లాల్లో కూరగాయల దిగుబడులు తగ్గిపోవడంతో ధరలు ఆకాశానంటుతున్నాయి. భానుడి భగభగలకు తోడు నీటి కొరతతో కూరగాయల తోటలు ఎండిపోతున్నాయి. టామాటాలు మొదలుకొని వంకాయ, బెండకాయ, దొండకాయ, కేబేజీ, పచ్చిమిర్చి.. ఇలా ఒకటేమిటి అన్ని కాయగూరల ధరలు ఆకాశానికి ఎగబాకాతోన్నాయి. గత నెలలో కేజీ 25 నుంచి 30 రూపాయలు పలికే కూరగాయలు ఇప్పుడు 50 రూపాయలను క్రాస్ చేశాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి […]

ఏం కొనేటట్టు లేవుగా..!
Follow us

| Edited By: Srinu

Updated on: May 14, 2019 | 7:00 PM

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. మార్కెట్‌లో ధరలు మండుతోన్నాయి. ప్రధానంగా జిల్లాల్లో కూరగాయల దిగుబడులు తగ్గిపోవడంతో ధరలు ఆకాశానంటుతున్నాయి. భానుడి భగభగలకు తోడు నీటి కొరతతో కూరగాయల తోటలు ఎండిపోతున్నాయి. టామాటాలు మొదలుకొని వంకాయ, బెండకాయ, దొండకాయ, కేబేజీ, పచ్చిమిర్చి.. ఇలా ఒకటేమిటి అన్ని కాయగూరల ధరలు ఆకాశానికి ఎగబాకాతోన్నాయి. గత నెలలో కేజీ 25 నుంచి 30 రూపాయలు పలికే కూరగాయలు ఇప్పుడు 50 రూపాయలను క్రాస్ చేశాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి దిగుబడులు బాగా తగ్గాయంటున్నారు వ్యాపారులు.

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సిద్ధిపేటతో పాటు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు కూరగాయలు దిగుమతి అవుతాయి. వీటితో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర, నుంచి టమాటా, క్యాప్సికం, ఆలు, పచ్చిమిర్చి ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు.

ఏపీలోని విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు నగరాల్లో మార్కెట్లకు కూడా కూరగాయల రాక తగ్గింది. రైతు బజార్లలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. వేసవి కారణంగా అందరూ శాఖాహారం ఎక్కువగా తీసుకోవడం.. దీనికి తోడు శుభకార్యాలు కావడంతో కూరగాయల వినియోగం పెరిగింది. దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశానంటుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో టమాటా, కాకర, క్యారెట్ బీట్రూట్ కిలో రూ.50పైననే పలుకుతోంది. బీర, వంగ తదితర రకాలు కిలో రూ.40ని క్రాస్ చేశాయి. ఇక ఇంటి వద్దకు వచ్చే వ్యాపారులు చెప్పే రేట్లు వింటే వడదెబ్బ తగలక మానదు.

ఇక టమాటాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైబ్రిడ్ టమాటాలు కిలో 45 నుంచి 50 రూపాయలు పలుకుతున్నాయి. దేశ టమాటాలు 35 నుంచి 40 రూపాయలు పలుకుతున్నాయి. గత నెల ఏప్రిల్ తొలివారంలో కేవలం 15 నుంచి 20 రూపాయలున్న టమాటా ఇప్పుడు ఏకంగా 50ని క్రాస్ చేసింది. ఇలా ఉంటే తాము ఏం కొనాలి..? ఏం తినాలి ..? అంటూ మధ్య తరగతి ప్రజలు వాపోతున్నారు.

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..