Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 46 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 246628 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 120406 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 119293 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6929 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • తిరుపతి: రేపటి నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభం. ఎనభై రోజుల తరవాత ప్రారంభమవుతున్న దర్శనాలు. రేపు ఎల్లుండి ఉద్యోగులతో ట్రయల్ రన్ ద్వారా దర్శనాలు. పదో తేదీ తిరుమల పై ఉన్న స్థానికులకు దర్శనాలు. 11వతీదీ నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభం. జూన్ నెలకు ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలు రేపటి నుంచి టిటిడి వెబ్ సైట్ లో లభ్యం. ఆఫ్ లైన్లో తిరుపతిలోని కౌంటర్లలో టికెట్లు లభ్యం. అలిపిరి నడక మార్గం నుంచి భక్తులు వెళ్లేందుకు అనుమతి. కాణిపాకం దేవాలయంలో రేపటి నుంచి ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్. పదో తేదీ నుంచి గంటకు మూడువందలమంది వరకూ భక్తులకు దర్శనాలు. శ్రీకాళహస్తిలో దేవాలయం రెడ్ జోన్ లో ఉండటం వల్ల ప్రస్తుతానికి దర్శనాలు ప్రారంభించడం లేదని ప్రకటించిన అధికారులు.
  • ఢిల్లీ లో లిక్కర పై ఉన్న స్పెషల్ కరోనా ఫీజు'ను ఉపసంహరించుకోనున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం. మద్యంపై గరిష్ట రిటైల్ ధరలో 70% విధించిన స్పెషల్ కరోనా ఫీజు'ను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం 2020 జూన్ 10 నుంచి అమల్లోకి రానుంది.
  • విశాఖ: లో రౌడీషీటర్ బర్త్ డే సెలబ్రేషన్స్. బౌన్సర్ లతో హల్చల్ చేసిన చిట్టిమాము గ్యాంగ్. పక్కా సమాచారంతో పార్టీ పై రైడ్ చేసిన సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు. రౌడీషీటర్ చిట్టిమాముతో పాటు పలువురు అరెస్ట్. భారీగా లిక్కర్,గంజాయి,లక్ష50వేలు నగదు స్వాధీనం. దువ్వాడ పోలీసులకు అప్పగించిన సిటీఎఫ్.
  • విజయవాడ: గ్యాంగ్ వార్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. డీసీపీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో విచారణ.. సందీప్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. 13 మంది నిందితులను విచారిస్తున్న పోలీసులు.. ల్యాండ్ సెటిల్మెంట్ వివాదమే కారణమని గుర్తింపు.. ధనేకుల శ్రీధర్, ప్రతాప్ రెడ్డి డి నాగబాబులను విచారిస్తున్న పోలీసులు.. మంగళగిరి కి చెందిన ఇద్దరు రౌడిసీటర్ల ఉన్నట్టు గుర్తింపు.. టెక్నాలజీ సహాయంతో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుల పండు తల్లిని పాత్రపై విచారిస్తున్న పోలీసులు..
  • అమరావతి: ఈనెల 16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం. 18న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్. కోవిడ్ నేపథ్యంలో 14 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు కుదించే అవకాశం. ఈనెల 31తో ముగియనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.

వివాదంలో ‘వాల్మీకి’ టైటిల్?

Varun Tej’s Valmiki taken to court over film’s title, వివాదంలో ‘వాల్మీకి’ టైటిల్?

వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న వాల్మీకి సినిమా ఈనెల 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. అయితే ఈ చిత్ర టైటిల్ మార్చాలంటూ చాలా రోజులుగా రచ్చ జరుగుతూనే ఉంది. దీనిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చినా కూడా బోయ సంఘం మాత్రం ఊరుకోవడం లేదు. వ‌రుణ్‌ తేజ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ నుంచి వస్తున్న వాల్మీకి చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుంది. ఓ గ్యాంగ్‌స్ట‌ర్ మంచివాడుగా ఎలా మారాడు..ఎందుకు మారాల్సి వచ్చింది.. అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తుంది. బోయవాడు వాల్మీకిగా మారి రామాయణం రాసాడు కాబట్టి.. తన సినిమా కూడా అలాగే ఉంటుందని తన సినిమాకు వాల్మీకి టైటిల్ పెట్టానని చెప్పాడు హరీష్ శంకర్. అయితే ఈ టైటిల్ విషయంలో ముందు నుంచి బోయ సామాజిక వ‌ర్గం నుంచి అభ్యంత‌రాలు వస్తూనే ఉన్నాయి. రామాయ‌ణాన్ని రాసిన వాల్మీకి పేరుని ఓ గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాకు ఎలా పెడ‌తారు.. అసలు ఆయన్ని ఓ గ్యాంగ్ స్టర్‌తో ఎలా పోలుస్తారంటూ వాళ్లు మండిపడుతున్నారు.

కచ్చితంగా ఈ టైటిల్‌ను మార్చాల్సిందే అంటూ వాళ్లు ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేశారు. ఇక ఇప్పుడు ఇష్యూలోకి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మణ్‌ కూడా వచ్చారు. ఈయన్ని కొందరు బోయ సామాజిక వ‌ర్గానికి చెందిన నేతలు క‌లిశారు. ల‌క్ష్మ‌ణ్‌ కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాకు `వాల్మీకి` టైటిల్ అని పెట్టడమే తప్పు.. దానివల్ల బోయ వాల్మీకి సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు.

ఇప్పటికే ఈ ఇష్యూపై సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేశామని.. త‌క్ష‌ణ‌మే సినిమా టైటిల్‌ను మార్చాల‌ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పాడు లక్ష్మణ్. లేక‌పోతే బోయ‌లంతా ఏక‌మ‌వుతారని ఆయన హెచ్చరిస్తున్నాడు. త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌కు ద‌ర్శ‌క నిర్మాత‌లు, న‌టులే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుందని చెప్పాడు ఈయన. చూడాలి మరి ఎం జరుగుతుందో.

Related Tags