బాలయ్యకు మెగాప్రిన్స్‌ వార్నింగ్..! ఇచ్చాడా..?!

బాలయ్యకు మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్‌ కూడా వార్నింగ్ ఇచ్చారా..? మెగా హీరోల్లో ఈ ఇష్యూపై ఇంటర్నల్‌గా చర్చ జరిగిందా..? అనే సందేహం ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలైంది . నిన్న మధ్యాహ్నం వరుణ్‌ తేజ్‌ చేసిన ఒక ట్వీట్ ఆలస్యంగా వైరల్ అవుతోంది. చేతిలో గన్ ఉన్నవాళ్లతో మాట్లాడుకోవడాల్లేవ్… అంటూ గద్దలకొండ గణేష్‌ గెటప్‌ని పోస్ట్ చేశారు వరుణ్‌తేజ్… పరిశ్రమలో ఏం జరుగుతోంది..? మీటింగులు పెట్టుకుని భూములు పంచుకుంటున్నారా..? అన్న బాలయ్య కామెంట్స్‌కు (మే28)నిన్న సాయంత్రం నాగబాబు కౌంటర్ ఇవ్వడంతో […]

  • Sanjay Kasula
  • Publish Date - 5:11 pm, Fri, 29 May 20
బాలయ్యకు మెగాప్రిన్స్‌ వార్నింగ్..! ఇచ్చాడా..?!

బాలయ్యకు మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్‌ కూడా వార్నింగ్ ఇచ్చారా..? మెగా హీరోల్లో ఈ ఇష్యూపై ఇంటర్నల్‌గా చర్చ జరిగిందా..? అనే సందేహం ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలైంది . నిన్న మధ్యాహ్నం వరుణ్‌ తేజ్‌ చేసిన ఒక ట్వీట్ ఆలస్యంగా వైరల్ అవుతోంది. చేతిలో గన్ ఉన్నవాళ్లతో మాట్లాడుకోవడాల్లేవ్… అంటూ గద్దలకొండ గణేష్‌ గెటప్‌ని పోస్ట్ చేశారు వరుణ్‌తేజ్…

పరిశ్రమలో ఏం జరుగుతోంది..? మీటింగులు పెట్టుకుని భూములు పంచుకుంటున్నారా..? అన్న బాలయ్య కామెంట్స్‌కు (మే28)నిన్న సాయంత్రం నాగబాబు కౌంటర్ ఇవ్వడంతో గొడవ రాజుకుంది. కానీ.. అంతకుముందే మెగాఫ్యామిలీలో బాలయ్యపై గరంగరం చర్చ షురూ అయ్యిందని.. ఆ క్రమంలో ఇన్‌డైరెక్ట్‌గా ట్విట్టర్లో వరుణ్‌తేజ్ ఇలా వార్నింగ్ ఇచ్చారని నెట్టింట్లో తెగ చర్చ జరుగుతోంది.

ఇదిలా వుంటే…బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్ రియాక్ట్ అయ్యారు. బాలయ్య అలా ఎందుకు మాట్లాడారో తనకు తెలియదన్న నరేష్.. నేను మా ప్రెసిడెంట్‌ని నాకూ ఏం చెప్పలేదు.. కాని ఎక్కడకు పిలుస్తారో అక్కడకు వెళ్లడమే మంచిది….అయితే త‌న‌ను పిల‌వ‌ని మీటింగుల‌కు మ‌రొక‌రిని ఎలా పిలుస్తాన‌ని ప్ర‌శ్నించారు. పరిశ్రమ క్లిష్టపరిస్థితులో ఉన్నప్పుడు గట్టెక్కించడం అనేది అందరి బాధ్యత అంటూ గుర్తు చేశారు.