Breaking News
  • అమరావతి: చంద్రబాబును నమ్మి భూములిచ్చి దళిత రైతులు మోసపోయారు. మా ప్రభుత్వ నిర్ణయంతో దళిత రైతులకు న్యాయంజరిగింది-ఎమ్మెల్యే ఆర్కే. దళిత రైతుల భూములను చంద్రబాబు తనవారికి కారుచౌకగా ఇప్పించారు. రాజధాని ప్రాంతంలో బినామీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల చిట్టాను త్వరలో బయటపెడతాం-ఎమ్మెల్యే ఆర్కే.
  • ప్రకాశం జిల్లా: సింగరాయకొండ మండలం పాకల దగ్గర సముద్రంలో నలుగురు యువకుల గల్లంతు. ముగ్గురిని కాపాడిన మెరైన్‌ పోలీసులు. మరో యువకుడి కోసం కొనసాగుతున్న గాలింపు.
  • యానాంలో ప్రేమజంట అనుమానాస్పద మృతి. మృతులు కాట్రేనిపాడుకు చెందిన రమేష్‌. మలికిపురం మండలానికి చెందిన యువతిగా గుర్తింపు. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమజంట. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 14 కిలోల బంగారం స్వాధీనం. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.46 కోట్లు ఉంటుందని అంచనా.
  • అమరావతి: అసెంబ్లీకి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు-చంద్రబాబు. అమాయకులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ పెట్టి దాడులు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఇంగ్లీష్‌ మీడియాన్ని వైసీపీ నేతలు వ్యతిరేకించారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెచ్చి రెండు నాలుకలధోరణి అవలంబిస్తున్నారు కొత్త చీఫ్‌ మార్షల్‌ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు-చంద్రబాబు.
  • గుంటూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ నెరవేర్చలేదు. ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు-యరపతినేని. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి-మాజీ ఎమ్మెల్యే యరపతినేని. నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ కార్యకర్తలే ఇసుకను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారు-మాజీ ఎమ్మెల్యే యరపతినేని.

మాటలు లేకుండా ఫ్లాప్ కొట్టారు.. మాట్లాడుకొని హిట్ కొట్టారు

Varun Tej and Pooja Hegde gets first, మాటలు లేకుండా ఫ్లాప్ కొట్టారు.. మాట్లాడుకొని హిట్ కొట్టారు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గద్దలకొండ గణేష్. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అన్నిచోట్ల పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో గద్దలకొండ గణేష్ పాత్రలో నటించిన వరుణ్.. అదిరిపోయే యాక్టింగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా వరుణ్ హవా కొనసాగుతోంది. ఇక ఈ హిట్‌తో ఈ ఏడాదిలో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు వరుణ్ తేజ్. ఇదిలా ఉంటే ఈ మూవీతో రెండోసారి జోడీ కట్టారు వరుణ్ తేజ్, పూజా హెగ్డే.

ఈ ఇద్దరు మొదటిసారి ‘ముకుంద’లో కలిసి నటించారు. వరుణ్ తేజ్ ఈ చిత్రం ద్వారానే హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. అయితే కథానుగుణంగా ఈ ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా ఉండదు. సినిమా పూర్తయ్యే వరకు కేవలం కళ్లతో మాత్రమే ఇరువురు తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. రాధా కృష్ణల ప్రేమ కథను దృష్టిలో పెట్టుకొనే ఈ పాత్రలను తాను రాశానని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. కాగా కథనంలో బలం లేకపోవడం వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయంగా నిలిచింది.

ఇక ఇప్పుడు ఇదే జోడి గద్దలకొండ గణేష్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. ఎల్లువచ్చి గోదారమ్మ పాటతో పాటు సినిమా మొత్తంగా దాదాపు 15 నిమిషాలు మాత్రమే పూజ పాత్ర ఉంటుంది. ఇక వీరి మధ్య సీన్లు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. కానీ ఉన్నంతసేపైనా వీరిద్దరి మధ్య కొన్ని డైలాగ్‌లు ఉంటాయి. దీంతో అప్పుడు మాట్లాడుకోకుండా ఫ్లాప్ కొట్టారు. ఇప్పుడు మాట్లాడుకొని హిట్ కొట్టారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరి జోడీకి మరో కామన్ పాయింట్ సంగీత దర్శకుడు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే నటించిన రెండు చిత్రాలకు మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించడం విశేషం.