కరోనా వైరస్.. అప్పుడు తాను చెప్పినట్లుగానే జరుగుతుందన్న వర్మ

కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా స్తంభించింది. ఎక్కడికెక్కడికి రాకపోకలు ఆగిపోవడంతో పాటు పలు దేశాలు లాక్‌డౌన్‌ను కఠినంగా పాటిస్తున్నాయి.

కరోనా వైరస్.. అప్పుడు తాను చెప్పినట్లుగానే జరుగుతుందన్న వర్మ
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 10:17 PM

కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా స్తంభించింది. ఎక్కడికెక్కడికి రాకపోకలు ఆగిపోవడంతో పాటు పలు దేశాలు లాక్‌డౌన్‌ను కఠినంగా పాటిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులను తాను ముందే ఊహించానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఈ క్రమంలో రెండు సంవత్సరాల క్రితం తాను అధికారికంగా ప్రకటించిన ఓ సినిమా కథను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. 2018లో వైరస్‌ అనే సినిమాను తాను చేయబోతున్నట్లు వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటనతో పాటు సినిమా కథను కూడా ఆయన తెలిపారు. వైరస్‌ మూవీ కథ ప్రకారం..” సెంట్రల్ ఆఫ్రికాకు వెళ్లిన ఓ యువకుడు.. ఓ డెడ్లీ వైరస్‌తో ముంబయికి వచ్చి ఇక్కడ ఆ వైరస్‌ను విస్తరింపజేస్తాడు. దాని తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో మనిషి, మనిషికి 20 అడుగుల దూరం మెయిన్‌టెన్ చేయాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. కానీ 2 కోట్ల జనాభా ఉన్న ముంబయిలో అది సాధ్యం కాదు. ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య లక్ష దాటేయగా.. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ముంబయికి అన్ని రకాల సంబంధాలను ప్రభుత్వం తెంచుకుంటుంది. ఇక వైరస్‌ తీవ్రత పెరుగుతూ ఉండగా.. ఎవరైతే ముంబయి నుంచి తప్పించుకోవాలనుకుంటారో వారిని కాల్చిపారేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ క్రమంలో ముంబయివాసుల మధ్య జరిగే భయం, ప్రేమ, త్యాగం, నమ్మకం ఇలాంటి అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నాను” అని వర్మ అప్పట్లో వెల్లడించారు. కాగా ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ఆయన అప్పట్లో రాసిన స్టోరీని పోలి ఉండటం విశేషం. కాగా ఈ వర్మ వేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మీరు జూనియర్ బ్రహ్మం గారు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

Read This Story Also: కరోనా వైరస్‌.. టెస్టింగ్‌ సెంటర్‌గా ప్రముఖ క్రికెట్ స్టేడియం

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.