సౌండ్ బాక్సుల్లో నాటు సారా.. బెడిసికొట్టిన అక్రమ రవాణా..!

అక్రమార్కులకు కాదేదీ అనర్హం అన్నట్లు కొత్త బాష్యం చెబుతున్నారు. అక్రమ రవాణాకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు సారా అక్రమ రవాణకు కొత్త దారిని ఎంచుకున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 3:43 pm, Tue, 27 October 20

అక్రమార్కులకు కాదేదీ అనర్హం అన్నట్లు కొత్త బాష్యం చెబుతున్నారు. అక్రమ రవాణాకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు సారా అక్రమ రవాణకు కొత్త దారిని ఎంచుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనతో పోలీసులే నివ్వరపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ మద్యం రవాణాకు పక్కా నిఘా పెంచి అక్రమ దందాను అడ్డుకుంటుంది. అయితే, అధికారుల కన్నుగప్పి కొందరు సారా వ్యాపారులు అక్రమ రవాణాకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ముగ్గురు వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై సారా రవాణా చేస్తూ పోలీసులకు చిక్కారు. అయితే సారా రవాణా కోసం సౌండ్ బాక్సులను వినియోగిండంతో పోలీసులు అవాక్యయ్యారు. ముగ్గురిని అరెస్టు చేసి 55 లీటర్ల నాటు సారాను, రెండు బైక్‌లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.