బ్యాన్ పై విచిత్రంగా స్పందించిన రాజాసింగ్

తన ఫేస్‌బుక్‌, ఇన్ స్టా అకౌంట్లపై ఆయా సంస్థలు తీసుకున్న నిషేధ నిర్ణయంపై హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. తన పేరు మీదున్న అకౌంట్లను డిలీట్ చేయటం హర్షనీయమేననీ, కానీ విద్వేషపూరిత వ్యాఖ్యలు..

బ్యాన్ పై విచిత్రంగా స్పందించిన రాజాసింగ్
Follow us

|

Updated on: Sep 03, 2020 | 2:20 PM

తన ఫేస్‌బుక్‌, ఇన్ స్టా అకౌంట్లపై ఆయా సంస్థలు తీసుకున్న నిషేధ నిర్ణయంపై హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. తన పేరు మీదున్న అకౌంట్లను డిలీట్ చేయటం హర్షనీయమేననీ, కానీ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలు చేస్తున్న ఎంఐఎం, కాంగ్రెస్ నేతల అకౌంట్లను కూడా పరిశీలించాలని సదరు సంస్థలకు రాజాసింగ్ విజ్ణప్తి చేశారు. అంతేకాదు.. ‘ఫేస్ బుక్ లో తన పేరు మీద ప్రస్తుతమున్నపేజీలు నా అధికారిక పేజీలు కాదు.. అవన్నీ బంద్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే, ఆయా పేజీలలో చేసిన పోస్టులతో తాను ఏకీభవిస్తానన్నారు. ఇక.. తన అధికారిక ఫేస్ బుక్ పేజీ 2018 లో హ్యాక్ అయ్యిందని.. ఆ తర్వాత దాన్ని వాడేందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అయితే, తాను సొంతంగా వాడేందుకు ప్రస్తుతం ఒక ఫేస్‌బుక్‌ పేజీ కావాలి.. దాన్ని ఫేస్‌బుక్‌ విధానాలను ఉల్లంఘించకుండా ఉపయోగిస్తాను. దీనికి సంబంధించి సదరు సంస్థలకు విన్నవించుకుంటానంటూ రాజాసింగ్ స్పష్టం చేశారు. కాగా, భారత్‌లో అధికారిక బీజేపీ నేతలు ఫేస్‌బుక్‌లో చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను ఫేస్‌బుక్‌ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తోందని.. అతి పెద్దదైన భారత మార్కెట్ కోసమే చర్యలు తీసుకోవడం లేదని ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఇటీవల రాసిన కథనం మేరకే ఎఫ్ బీ ఈ చర్యలు తీసుకొన్నట్టు భావిస్తున్నారు.