Breaking News
  • దేశవ్యాప్తంగా దీపయజ్ఞం. ప్రధాని మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించిన దేశ ప్రజలు. దీపం వెలిగించిన రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు. దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందిన భారత్‌. తెలుగు రాష్ట్రాల్లో దీపాల కాంతులు. ప్రగతి భవన్‌లో దీపాలు వెలిగించిన సీఎం కేసీఆర్‌. తాడేపల్లిలోని తన నివాసంలో దీపాలు వెలిగించిన ఏపీ సీఎం జగన్‌. దీపాలు వెలిగించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌లు తమిళిసై, భిశ్వభూషణ్. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. అత్యవసరసేవలు అందిస్తున్న వైద్యులు, పోలీసులు.. పారిశుద్ధ్య సిబ్బందికి దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన ప్రజలు.
  • 130 కోట్ల ప్రజల మహాశక్తిని చాటిన భారతీయులు. దీప యజ్ఞంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు. కుటుంబ సమేతంగా దీపం వెలిగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తన నివాసంలో దీపాలు వెలిగించిన ప్రధాని మోదీ. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు.
  • ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ఫోన్‌. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగ్‌లు అవసరం. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌. గన్నీ బ్యాగ్‌లకు తీవ్ర కొరత ఉందని వివరించిన సీఎం కేసీఆర్‌. పశ్చిమబెంగాల్‌లో గన్నీ బ్యాగ్‌ల పరిశ్రమలు తెరిపించాలన్న కేసీఆర్‌. పరిశ్రమలు తెరిపిస్తేనే గన్నీ బ్యాగ్‌ల సమస్య తీరుతుందన్న కేసీఆర్‌. పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా గన్నీ బ్యాగ్‌లు.. తీసుకొచ్చేందుకు అనుమతించాలని ప్రధాని మోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి. సంబంధిత శాఖలతో మాట్లాడతానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.
  • ఒక్క తప్పుడు మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసినా కేసులు బుక్‌ చేస్తాం. వెరిఫై చేయకుండా సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేయొద్దు. డిజిటల్‌గా వెదికి పట్టుకుని అరెస్ట్‌ చేస్తాం. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన వారిలో ఎవరూ కావాలని.. కరోనా వ్యాప్తి చేశారనడానికి ఆధారాలు లేవు. -టీవీ9 ఎన్‌కౌంటర్‌ విత్‌ మురళీకృష్ణలో అంజనీకుమార్‌, సజ్జనార్‌.
  • కర్నూలులో కరోనా విజృంభణ. ఒకేరోజు 12 పాజిటివ్‌ కేసులు నమోదు. 12 మంది ఢిల్లీ సభలకు వెళ్లివచ్చిన వారే. కర్నూలులో మొత్తం 53 కరోనా కేసులు నమోదు. కాంటాక్ట్‌ కేసులపై దృష్టిపెట్టిన అధికారులు.

అధికారపార్టీలో మినిస్టర్‌తో ఎమ్మెల్యే ఢీ

variety fight in cooperative elections, అధికారపార్టీలో మినిస్టర్‌తో ఎమ్మెల్యే ఢీ

సహకార సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు దారి తీసింది. ఓ మంత్రికి, ఎమ్మెల్యేకు మధ్య సమరానికి తెరలేపింది. పట్టు కోసం పాకులాడుతున్న ప్రజా ప్రతినిధులు వారి అనుచర గణాన్ని బరిలోకి దింపి సై అంటే సై అంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వర్గాల మధ్య కొనసాగుతున్న సహకార పోరు ఆసక్తికర చర్చగా మారింది.

మహబూబాబాద్ జిల్లా నుంచి సత్యవతి రాథోడ్‌ మంత్రి అయ్యారు. సీనియర్‌ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌కు పదవి దక్కలేదు. దీంతో అప్పటి నుంచి వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తాజాగా సహకార ఎన్నికల్లో కూడా వీరి మధ్య ఫైట్‌ మొదలైంది. కురవి మండలం గుండ్రాతిమడుగు సహకార ఎన్నికల్లో పట్టు కోసం మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు వర్గాల నుంచి నేతలు ఎన్నికల బరిలోకి దిగారు. పోటాపోటీగా ప్రచారం కూడా మొదలుపెట్టారు.

ఈ ఎన్నికలు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్న రీతిలో జరుగుతున్నాయి. డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సూచించిన పెద్దలే చక్రం తిప్పుతున్నారు. గుండ్రాతి మడుగు సొసైటీ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఒకే పార్టీలో పోటీ కనిపిస్తుంది. మంత్రి సత్యవతి రాథోడ్‌కు గుండ్రాతిమడుగు సొంత ఊరు . దీంతో ఆమె ముఖ్య అనుచరుడైన కురవి జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి తమ వర్గం తరపున అభ్యర్థులను బరిలోకి దింపారు. తమ వర్గం తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాత్రం తమ చైర్మన్ అభ్యర్థిగా గార్లపాటి వెంకట్ రెడ్డిని ప్రకటించి అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపారు. తమ వర్గం గెలిచి మంత్రిపై పైచేయి సాధించాలని చూస్తున్నారు. ఒకే పార్టీ నుంచి మంత్రి, ఎమ్మెల్యే వర్గీయులు సహకార ఎన్నికల్లో వేరువేరుగా అభ్యర్థులను బరిలో దించడం రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరు మూడు దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులు. రెండు వర్గాలుగా విడిపోయి ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరు ఒకే పార్టీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాలలో సత్యవతి రాథోడ్ కు ఉహించని రీతిలో మంత్రి పదవి వరించడంతో రెడ్యానాయక్‌‌తో పాటు తన వర్గీయులు జీర్ణించుకోలేపోతున్నారు. ఈ విషయం ఇన్ని రోజులు నిమురు గప్పిన నిప్పులా ఉన్నప్పటికీ తాజాగా సహకార ఎన్నికల్లో ఒక్క సారిగా బయటపడ్డాయి. ఎక్కడ నలుగురు వక్తులు కనిపి౦చిన ఇదే విషయం చర్చించు కుంటున్నారు. సహకార ఎన్నికలో ఎవరు పై చేయి సాధిస్తారో ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Related Tags