Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 8 లక్షల 78 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 878254. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 301609. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 553471. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23174. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • భవిష్యవాణి లో స్వర్ణలత. భక్తులు 5వారాల పాటు శాఖ పోయాలి. పప్పు బెల్లాలతో ప్రతి గడప నుండి నాకు పూజ చేయాలి. నాకు ఈ ఏడు సంతోశమ్ లేదు. ఎవరు చేసుకుంది వారు అనుభవించాల్సిందే. నా ప్రజలని నేను కాపాడత.
  • తూర్పుగోదావరి జిల్లా : జగ్గంపేట నియోజకవర్గం కాపుసోదరులకు మాజీ మంత్రి ముద్రగడ బహిరంగ లేఖ. కాపు ఉద్యమం నుండి తప్పుకోవాలని నిర్ణయించు కొన్నా.. ముద్రగడ . ఇటీవల కొంతమంది సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ల నాపై దాడులు చేస్తున్నారు... ముద్రగడ . నన్ను కులద్రోహి గజదొంగ వంటి మాటలతో విమర్శిస్తున్నారు.. ముద్రగడ . నేను ఉద్యమం లో వసూలు చేసిననిధులు వారికి పంచలేదనా ఆ దాడులు... ముద్రగడ .
  • కరోనా వైరస్ నేపద్యంలో జైల్ లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని హైకోర్టు లో పిల్ . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైల్లో ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలంటూ పిల్ లో పేర్కొన్న పిటిషనర్ లింగయ్య . ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెరోల్ పై విడుదల చేస్తున్నారని, తెలంగాణలో కూడా విడుదల చేసేలా . ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న పిటిషనర్ . మరి కొద్ది సేపటిలో విచారణ చేయున్న హైకోర్టు.
  • గాంధీలో నాలుగో రోజు కొనసాగుతున్న నర్సుల సమ్మె. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్చలతో ఏకీభవించని నర్సులు. విధులు బహిష్కరించిన 200 మంది నర్సులు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా హెడ్ నర్స్ పదోన్నతి పై మండిపాటు.
  • బాలీవుడ్‌లో మరో విషాదం. ముంబై: బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చోక్సీ (29) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆదివారం తుది శ్వాస విడిచారు. దివ్య అకాల మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

సీఎంగా ప్రమాణం చేసిన జిల్లాకే వెన్నుపోటు : వంగవీటి రాధా

Vangaveeti Radha fires at CM Jagan Reddy, సీఎంగా ప్రమాణం చేసిన జిల్లాకే వెన్నుపోటు : వంగవీటి రాధా

ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ. అమరావతి రైతులకు మద్దతుగా ఆయన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాధా..  సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జిల్లాకే జగన్ వెన్నుపోటు పోడిచారని ఆరోపించారు.  మనసున్న మారాజని 151 సీట్లు ఇస్తే,  ఆయనకు మాత్రం ప్రజల గోడు పట్టడం లేదని ఎద్దేవా చేశారు. 33 వేల ఎకరాల రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు, వారి పండగకు ఇచ్చే గిప్ట్ రోడ్లు ఎక్కేలా చెయ్యడమా అని ప్రశ్నించారు. రైతుల్ని కొందరు పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటున్నారని, వారిని అమరావతి పంపిస్తే..అసలు ఆర్టిస్ట్‌లు ఎవరో తెలిపోతుందన్నారు.

సీఎం జగన్‌కు..పక్క రాష్ట్రానికి వెళ్లడానికి, ఎడ్ల పందేలు తిలకించడానికి సమయం ఉంది కానీ, రైతుల గురించి మాట్లాడేందుకు మాత్రం సమయం లేదా అని విమర్శలు సంధించారు. అమరావతి ప్రాంతంలో కుల, మత, పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం జరగుతోందని, దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. వైసీపీ వాళ్లు 3 రాజధానులు కాకపోతే, 30 రాజధానులు అనుకున్నా, తమకు మాత్రం అమరావతే రాజధాని అని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా రైతులు త్యాగాలను ప్రశంసించిన రాధా, వారి ఉద్యమానికి మద్దతుగా ఉంటానని హామి ఇచ్చారు.

లాంగ్ గ్యాప్:

చాలా రోజుల తర్వాత ప్రజలతో కనిపించారు వంగవీటి రాధా. 2019 ఎన్నికలకు ముందు సీటు విషయంలో వైసీపీతో విభేదించి, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం అనంతరం అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ కలవడం చర్చనీయాంశమైంది. తాజాగా లోకేశ్‌తో కలిసి చంద్రబాబును కలిసిన రాధా, అధినేత సూచనల మేరకు రైతుల నిరసన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది.

 

 

Related Tags