వందే భారత్ మిషన్ 4: 29 దేశాలకు.. 1197 విమాన సర్వీసులు..

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో వందే భారత్ మిషన్’ నాలుగో దశలో 1197 విమాన సర్వీసులు నడపనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. ఇందులో 945 అంతర్జాతీయ

వందే భారత్ మిషన్ 4: 29 దేశాలకు.. 1197 విమాన సర్వీసులు..
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 8:35 PM

Vande Bharat Mission Phase 4: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో వందే భారత్ మిషన్’ నాలుగో దశలో 1197 విమాన సర్వీసులు నడపనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 945 అంతర్జాతీయ, 252 ఫీడర్ విమానాలు ఉంటాయని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. ఎయిర్ ఇండియాతోపాటు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ విమానయాన సంస్థలు సేవలందిస్తాయని తెలిపారు. 29 విదేశాల నుంచి దేశంలోని 34 ఎయిర్‌పోర్టులకు విమాన సర్వీసులు నడుపుతాయని వివరించారు.

ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ ద్వారా 29 దేశాలకు విమానాలు నడుపనున్నారు. కరోనా సంక్షోభ సమయంలో.. పలు దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ‘వందే భారత్ మిషన్’ కింద కేంద్ర ప్రభుత్వం తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మూడు దశలు పూర్తికాగా త్వరలో నాలుగో దశ తరలింపు ప్రక్రియ ప్రారంభం‌కానున్నది.

Also Read: ఎంట్రెన్స్‌ పరీక్షలు రద్దు.. డీమ్డ్‌ వర్సిటీలకు డిమాండ్..