వంశీ..వాట్సాప్ రాజకీయాలు ఆపితే బెటర్..

ఏపీలో ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అన్ని పార్టీల నేతలతో సంప్రదింపుల అనంతరం వంశీ టీడీపీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వంశీ స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చెయ్యకుండా…వాట్సాప్ ద్వారా సందేశాలు పంపడంపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమా ఫైరయ్యారు. నాలుగు రోజుల క్రింత చంద్రబాబును వంశీ కలిశారని.. ఆ తర్వాత సుజనా చౌదరి కారులో గుంటూరు వెళ్లడం.. సాయంత్రం జగన్‌ను కలిశారని..ఈ పరిణామాల […]

వంశీ..వాట్సాప్ రాజకీయాలు ఆపితే బెటర్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 28, 2019 | 7:21 PM

ఏపీలో ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అన్ని పార్టీల నేతలతో సంప్రదింపుల అనంతరం వంశీ టీడీపీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వంశీ స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చెయ్యకుండా…వాట్సాప్ ద్వారా సందేశాలు పంపడంపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమా ఫైరయ్యారు.

నాలుగు రోజుల క్రింత చంద్రబాబును వంశీ కలిశారని.. ఆ తర్వాత సుజనా చౌదరి కారులో గుంటూరు వెళ్లడం.. సాయంత్రం జగన్‌ను కలిశారని..ఈ పరిణామాల తర్వాత వంశీ మీడియాలో మాట్లాడలేదని గుర్తు చేశారు ఉమా. వల్లభనేని జగన్‌ను ఎందుకు కలిశారో చెప్పలేదని.. ఆయన వాట్సాప్‌లో చంద్రబాబుకు లేఖ పంపారని.. దానికి పార్టీ స్పందించిందని మీడియా ద్వారా తాను చూశానన్నారు ఉమా. ఇదంతా గందరగోళం కాక మరేంటని అభిప్రాయపడ్డారు. టీడీపీకి కొందరు నేతలు రాజీనామాలు చేయడం కొత్తేమీ కాదని.. ఈ ఐదు నెలల్లో చాలామంది టీడీపీ నుంచి బయటకు వెళ్లారని ఉమా గుర్తు చేశారు.

రాజీనామా విషయంలో..పార్టీకి అయితే అధ్యక్షుడికి లేఖ రాయాలి.. అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని.. ఎమ్మెల్యే పదవికి అయితే స్పీకర్ ఫార్మాట్‌లో లేఖ పంపాలని గుర్తు చేశారు. ఇది రూల్ పొజిషన్, పార్టీలో ఉండే నేతలు చేసే పనిగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని.. కొత్తగా వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో రాజీనామాలు చేసే పద్దతి వచ్చిందని వ్యగ్యంగా మాట్లాడారు బొండా. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు వల్లభనేని వంశీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంటే… బొండా ఉమ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.