Breaking News
  • విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్‌ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించాం-ఈవో సురేష్‌ బాబు.
  • చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్‌ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్‌ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాపీ కొడుతూ జగన్‌ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర అగ్నిప్రమాదం. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో మంటలు. మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది.
  • అమరావతి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. వాడీవేడిగా జరగనున్న సమావేశాలు. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదలపై.. రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్న టీడీపీ. ఉల్లి ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన. అసెంబ్లీ గేట్‌ నుంచి ఉల్లిపాయల దండలతో.. అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

ఎన్టీఆర్ ఓ ట్రాన్స్‌ఫార్మర్..లోకేశ్ కోసం అతన్ని తొక్కేశారు

Big News Big Debate : Vallabhaneni Attacks TDP, ఎన్టీఆర్ ఓ ట్రాన్స్‌ఫార్మర్..లోకేశ్ కోసం అతన్ని తొక్కేశారు

ఏపీ రాజకియాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. టీడీపీ నుంచి వలసల పర్వ కొనసాగుతుంది. అనూహ్యంగా దేవినేని అవినాశ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కొన్ని రోజులుగా పొలిటికల్ జర్నీపై సస్పెన్స్ కొనసాగిస్తూ వస్తోన్న వల్లభనేని వంశీ నేడు ప్రెస్ మీట్ పెట్టి ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌తో పాటు పలువురు నేతలపై సీరియస్ కామెంట్స్ చేశారు వంశీ. ఇక యంగ్ హీరో ఎన్టీఆర్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశాడు వల్లభనేని వంశీ.

2009 సమయంలో ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారానికి తాను, కొడాలి నాని కలిసి ఒప్పించి తీసుకొచ్చామని తెలిపారు వంశీ. ఎన్నికల ఫలితాల తర్వాత..జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయిందంటూ ఓ వార్తా పత్రికతో తప్పుడు ప్రచారం చేయించారని పేర్కొన్నారు. నారా లోకేశ్ పొలిటికల్ భవితవ్యం కోసమే ఎన్టీఆర్‌ను పక్కన పెట్టారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు వల్లభనేని వంశీ. ఎన్టీఆర్ ముందు ఎవరూ నిలవరని, అతనో ట్రాన్స్‌ఫార్మర్ అని వంశీ అభివర్ణించారు. ఎన్టీఆర్ ఒక చిన్నపిల్లాడని..తన కెరీర్‌ను పణంగా పెట్టి ప్రచారం చేసినా..చంద్రబాబు పక్కన బెట్టారని పేర్కొన్నారు. అందుకే ఆత్మాభిమానం అడ్డొచ్చి ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారని తెలిపారు వంశీ.