బిగ్ బ్రేకింగ్: టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపారు. అదే సమయంలో ఆ లేఖను టీవీ9 కూడా వాట్సాప్ ద్వారా పంపించారు. గత కొద్దిరోజులుగా వంశీ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇటీవలే బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయిన అనంతరం..వంశీ.. సీఎం జగన్‌తో కూడా సమావేశమయ్యారు. నియోజకవర్గ సమస్యలు, నకిలీ ఇళ్ల పట్టాల కేసులును వంశీ..జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కాగా సీఎంతో […]

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా
Follow us

|

Updated on: Oct 27, 2019 | 4:23 PM

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపారు. అదే సమయంలో ఆ లేఖను టీవీ9 కూడా వాట్సాప్ ద్వారా పంపించారు. గత కొద్దిరోజులుగా వంశీ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇటీవలే బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయిన అనంతరం..వంశీ.. సీఎం జగన్‌తో కూడా సమావేశమయ్యారు. నియోజకవర్గ సమస్యలు, నకిలీ ఇళ్ల పట్టాల కేసులును వంశీ..జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కాగా సీఎంతో సమావేశం అనంతరం వంశీ పార్టీ మారడం దాదాపు కన్ఫార్మ్ అయింది.  వైసీపీలో చేరాలంటే పదవులకు రాజీనామా చేయాలని సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం. అందుకు అంగీకరించిన వంశీ తాజాగా టీడీపీ, శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

కాగా వంశీ వైసీపీ లోకి చేరుతారనే ప్రచారం తో గన్నవరం వైసీపీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు ఆందోళన దిగారు. రేపు యార్లగడ్డ..సీఎంతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత వంశీ ఎప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే అంశంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఆయన రాజీనామా లేఖలోని పూర్తి పాఠం: