Breaking News
 • ఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన.. ముస్లిమేతరులకు భారతదేశ పౌరసత్వం కల్పించడం బిల్లు ఉద్దేశం.
 • హైదరాబాద్‌: నెమ్మదిగా దిగి వస్తున్న ఉల్లి ధరలు. అందుబాటులోకి వస్తున్న కొత్త పంట. మలక్‌పేట్‌ మార్కెట్‌లో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లి. మేలు రకం కిలో రూ.70 నుంచి 90 పలుకుతున్న ఉల్లి . రైతు బజార్లలో రాయితీపై రూ.40కే విక్రయిస్తున్న ప్రభుత్వం. కర్ణాటక, మహబూబ్‌నగర్‌, మెదక్‌ నుంచి వచ్చిన ఉల్లి.
 • ఆర్టీసీ సమ్మె నష్టం అంచనా వేస్తున్న అధికారులు. సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ.400 కోట్ల మేర నష్టం. ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కోట్లకు దాటుతుందని అంచనా.
 • హైదరాబాద్‌: 105 మంది డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల హేతుబద్ధీకరణ. ఇతర కళాశాలలకు బదిలీ చేసేందుకు నేడు కౌన్సెలింగ్‌.
 • నేడు ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. అవినీతి నిర్మూలన, రివర్స్‌ టెండరింగ్‌పై నేడు స్వల్పకాలిక చర్చ. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
 • టీఎస్‌ ఆర్టీసీలో అప్రెంటిషిప్‌ అభ్యర్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు. ఈనెల 14న పరీక్షలు నిర్వహించనున్న ఆర్టీసీ . అక్టోబర్‌ 31 నాటికి అప్రెంటిషిప్‌ పూర్తి చేసిన అభ్యర్థులు.. ప్రాక్టికల్‌ పరీక్షలు హాజరుకావాలన్న ఆర్టీసీ యాజమాన్యం.

జగన్‌తోనే నా ప్రయాణం: వల్లభనేని వంశీ

Gannavaram Mla Vallabhaneni Vamsi Ready To Join Ysrcp, జగన్‌తోనే నా ప్రయాణం: వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దాదాపు 20 రోజుల క్రితమే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. అంతకముందు ఆయన బీజేపీ నేత సుజనా చౌదరి, సీఎం జగన్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. అన్నీ రాజకీయ, సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకున్న వంశీ…వైసీపీలో చేరడానికే మొగ్గు చూపారు. కానీ ఇన్నిరోజులు సైలెన్స్‌ని మెయింటేన్ చేస్తూ వస్తుండటంతో గన్నవరం ఎమ్మెల్యే పొలిటికల్ జర్నీపై సస్పెన్స్ నెలకుంది. కాగా నేడు ప్రెస్‌మీట్ పెట్టి సీఎం జగన్‌కే తన సపోర్ట్ అంటూ కుండబద్దలు కొట్టారు. పనిలో పనిగా టీడీపీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై, నాయకులపై విమర్శలు గుప్పించారు వంశీ.

వంశీ ప్రెస్ మీట్‌‌లో మాట్లాడిన ముఖ్యాంశాలు:

 • వైపీపీ ప్రభుత్వానికి ఇంకా పురుడు వాసన పోలేదు..అప్పుడే దీక్షలా..?
 • అకాల వర్షాలు, వరదలు వస్తే ఇసుక ఎలా తీయగలరు..?
 • అపార అనుభవం ఉన్న చంద్రబాబు .. ప్రతిపక్ష నాయకుడి పాత్రను సరిగ్గా పోషించలేకపోతున్నారు
 • వర్ధంతికి, జయంతికి తేడా తెలియని వాళ్లు పార్టీని నడిపితే.. అందులో ఎలా ఉండగలం..?
 • జగన్‌తో..పరిటాల రవి బ్రతికి ఉన్నప్పటి నుంచి నాకు సత్సంబంధాలు..ఆయనతో నా ప్రయాణం
 • పార్టీ మారడం వల్ల నాకు ఎటువంటి ఆర్థిక, రాజకీయ పరమైన లాభాలు లేవు..
 • కేసులు కొత్త కాదు..అవి కోర్టు పరిధిలోనివి
 • 2009లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేశారు..ఈ పదేళ్లలో అతన్ని ఒక్కసారయినా పట్టించుకున్నారా?..ఆ తర్వాత ఎన్టీఆర్ ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు.
 • పొత్తు పెట్టుకోవడం..అవసరం తీరిపోయిన వెంటనే బయటకు వచ్చి తిట్టడం చంద్రబాబుకు అలవాటు
 • వారసత్వ రాజకీయాలపై నాకు మోజు లేదు