పొంగల్ బరిలో నుంచి పవర్ స్టార్ తప్పుకున్నట్లేనా..? ‘వకీల్ సాబ్’ థియేటర్లలో అడుగుపెట్టేది అప్పుడేనా..?

పవర్‌ స్టార్ రీఎంట్రీ సినిమా రిలీజ్ ఎప్పుడు..? వకీల్ సాబ్ సంక్రాంతికి లేన్టటేనా..? ఈ విషయం అర్థం కాకే తల పట్టుకున్నారు పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌.

పొంగల్ బరిలో నుంచి పవర్ స్టార్ తప్పుకున్నట్లేనా..? 'వకీల్ సాబ్' థియేటర్లలో అడుగుపెట్టేది అప్పుడేనా..?
Follow us

|

Updated on: Dec 03, 2020 | 10:16 AM

పవర్‌ స్టార్ రీఎంట్రీ సినిమా రిలీజ్ ఎప్పుడు..? వకీల్ సాబ్ సంక్రాంతికి లేన్టటేనా..? ఈ విషయం అర్థం కాకే తల పట్టుకున్నారు పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌. లాక్‌ డౌన్‌ రాకపోయుంటే వకీల్ సాబ్‌ ఈ పాటికే రిలీజ్ అయ్యుండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. వకీల్‌ సాబ్‌ రిలీజ్ ఎప్పుడన్నది దర్శక నిర్మాతలకే అర్ధం కావటం లేదు. లాక్ డౌన్‌ తరువాత షూటింగ్ స్టార్ట్ చేసిన పవన్‌.. వెంటనే ప్యాకప్‌ చెప్పేశారు. మెట్రో ట్రైన్‌లో తెగ హడావిడి చేసి.. అంతే స్పీడుగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చేశారు. రీస్టార్ట్ చేయడానికే చాలా ఆలస్యం చేసిన పవన్‌ .. ఇప్పుడు కూడా పెద్దగా షూటింగ్ చేసే మూడ్‌లో అయితే కనిపించటం లేదు. పొలిటికల్ యాక్టివిటీస్‌ కోసం సినిమాలు పక్కన పెట్టేస్తున్నారు పవర్‌ స్టార్‌.

దీంతో సంక్రాంతికి వకీల్‌ సాబ్‌ రిలీజ్‌ కష్టమని ఫిక్స్ అయ్యారు మేకర్స్‌. హడావిడిగా సంక్రాంతికి వచ్చే కన్నా.. కాస్త తీరిగ్గా సమ్మర్‌ ని టార్గెట్‌ చేస్తే బెటర్‌ అని భావిస్తున్నారట. ఇప్పటికే 15 రోజులుగా బ్రేక్‌లో ఉన్నపవన్‌, నీహారిక పెళ్లి తరువాత గానీ సెట్టుకొచ్చే ఛాన్స్‌ లేదు. అందుకే వకీల్ సాబ్‌ మేకర్స్ సంక్రాంతిని లైట్‌ తీసుకోని… సమ్మర్‌ను టార్గెట్ చేస్తున్నరాని పవన్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read :

నేడు రైతులతో కేంద్రం 4వ విడత చర్చలు, సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని సంఘాల వార్నింగ్

మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !

ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి