గుజరాత్: రోడ్లపైకి కొట్టుకొస్తున్న మొసళ్లు.. ప్రాణభయంతో ప్రజలు

భారీ వర్షాలు, వరదలతో గుజరాత్ అల్లకల్లోలం అవుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విశ్వామిత్ర నదికి వరదలు సంభవించాయి. ముఖ్యంగా వడోదర, కచ్ వంటి జిల్లాల్లో నదులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటితో వీధులు నిండిపోయాయి. జనావాసాల్లోకి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నదుల నుంచి వస్తున్న ప్రవాహంతో మొసళ్ళు కొట్టుకువస్తున్నాయి. వీధుల్లో ఇవి ఎక్కువగా కనిపించడంతో ప్రజలు భయపడుతున్నారు. అసలే వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతుంటే.. ప్రాణానికి హానికరమైన ఈ […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:07 pm, Mon, 12 August 19
గుజరాత్: రోడ్లపైకి కొట్టుకొస్తున్న మొసళ్లు.. ప్రాణభయంతో ప్రజలు

భారీ వర్షాలు, వరదలతో గుజరాత్ అల్లకల్లోలం అవుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విశ్వామిత్ర నదికి వరదలు సంభవించాయి. ముఖ్యంగా వడోదర, కచ్ వంటి జిల్లాల్లో నదులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటితో వీధులు నిండిపోయాయి. జనావాసాల్లోకి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నదుల నుంచి వస్తున్న ప్రవాహంతో మొసళ్ళు కొట్టుకువస్తున్నాయి. వీధుల్లో ఇవి ఎక్కువగా కనిపించడంతో ప్రజలు భయపడుతున్నారు. అసలే వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతుంటే.. ప్రాణానికి హానికరమైన ఈ ప్రాణలు సంచరించడం కంటి మీద కునుకు లేకుండా పోతోందని వారు చెబుతున్నారు. కాగా ఇప్పటివరకూ పట్టణంలోకి ప్రవేశించిన 25 మొసళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. మరోవైపు జనం మొసళ్ళ భయం కారణంగా రోడ్లపైకి రావడం మానేశారు.