కోల్‌కతా‌లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకువెళ్తున్న వ్యాన్ దారి మళ్లింపు , మంత్రి ఆధర్యంలో రైతుల రాస్తారోకో కారణమట

కోల్ కతా లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకువెళ్తున్న వ్యాన్ ను బలవంతంగా దారి మళ్లించారు. ఫుర్భా వర్ధమాన్ జిల్లాలో రాష్ట్ర మంత్రి సిద్దివుల్లా చౌదరి తన మద్దతుదారులు..

  • Umakanth Rao
  • Publish Date - 10:01 am, Thu, 14 January 21

Covid Vaccine: కోల్‌కతాలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకువెళ్తున్న వ్యాన్ ను బలవంతంగా దారి మళ్లించారు. ఫుర్భా వర్ధమాన్ జిల్లాలో రాష్ట్ర మంత్రి సిద్దివుల్లా చౌదరి తన మద్దతుదారులు, రైతులతో నేషనల్ హైవేని బ్లాక్ చేయడంతో ఆ మార్గం ద్వారా రాకపోకలు నిలిచిపోయాయి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆయన ఆధ్వర్యాన  స్థానికులు, అన్నదాతలు నిరసన ప్రకటిస్తూ ఆ దారంట వాహనాలను నిలిపివేశారు. కోల్ కతా-ఢిల్లీని కలిపే ఈ రోడ్డు ద్వారా వ్యాక్సిన్ వ్యాన్ వెళ్లాల్సి ఉంది. కానీ బ్లాకేడ్ కారణంగా ఈ వాహనం 20 కి.మీ. చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఈ వాహనంలో 31,500 డోసుల వ్యాక్సిన్ ఉంది. బంకురా, పురూలియా జిల్లాలకు ఇది చేరాల్సి ఉంది.

అయితే ఈ కోవిడ్ వ్యాక్సిన్ వాహనం గురించి తనకు తెలియదని, తెలిశాక బ్లాకేడ్ ఎత్తివేసేలా చూశానని మంత్రి సిద్దివుల్లా చౌదరి తెలిపారు. కానీ అప్పటికే ఈ వాహనం వెళ్ళిపోయింది. కోవిడ్ రోగులకు సకాలంలో అందాల్సిన వ్యాక్సిన్ కి కూడా ఈ విధమైన రాజకీయ అవాంతరాలు రావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.

Also Read:

డోనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం, రెండో సారి, 10 మంది రిపబ్లికన్లు కూడా !

జీవకోటి జీవితాల్లో చీకటిని రూపుమాపి వెలుగును ప్రసాదించే శుభతరుణం.. సంక్రాంతి, సాంప్రదాయం ప్రకారం ఈ పర్వదినాన ఏం చేయాలి?

‘కుల్‌దీప్‌ వేసిన బంతి ఎలా ఉంది? అది ఔట్‌ అంటారా?’ ఆసక్తిగా ఉన్న ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో..