తెలంగాణకు చేరుకున్న వ్యాక్సిన్‌.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా కోఠిలోని కోల్డ్ స్టోరేజీకి..

తెలంగాణలో 16 నుంచి వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వ్యాక్సిన్స్‌..అక్కడి నుంచి కోఠిలోని కోల్డ్ స్టోరేజీకి చేరతాయి. ఆ తర్వాత జిల్లాలకు..

తెలంగాణకు చేరుకున్న వ్యాక్సిన్‌.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా కోఠిలోని కోల్డ్ స్టోరేజీకి..
Follow us

|

Updated on: Jan 12, 2021 | 10:14 AM

తెలంగాణలో 16 నుంచి వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వ్యాక్సిన్స్‌..అక్కడి నుంచి కోఠిలోని కోల్డ్ స్టోరేజీకి చేరతాయి. ఆ తర్వాత జిల్లాలకు సరఫరా అవుతాయి. అక్కడి నుంచి ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తారు. 16న మొత్తం 139 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తారు. ప్రతి జిల్లాలో 2 నుంచి 3 కేంద్రాలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొదటి వ్యాక్సిన్‌ను తానే వేసుకుంటాననీ, టీకాలపై ఎలాంటి భయాలూ వద్దని తెలిపారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.

తెలంగాణలో తొలి విడతగా 2.9 లక్షల మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్లు వేయబోతున్నారు. మొత్తం 5కోట్ల వ్యాక్సిన్ డోసులను నిల్వ చేసేందుకు ఏర్పాట్లుచేశారు. హైదరాబాద్‌లో 3 కోట్లు, జిల్లాల్లో 3 కోట్ల డోసులను స్టోరేజ్‌ చేస్తారు. హెల్త్‌ వర్కర్స్‌కు ఇచ్చే రెండు డోసుల వ్యాక్సిన్‌ను ఒకేసారి పంపుతోంది కేంద్రం. ఇక మొదటి రోజున 13వేల 9వందల మందికి టీకా వేయనున్నారు. హైదరాబాద్‌లోని కోఠి నుంచి దాదాపు 5 లక్షల సిరంజిలను ప్రత్యేక వాహనాల్లో జిల్లాలకు తరలిస్తున్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్‌ కూడా నిన్న మంత్రులు, కలెక్టర్లతో సమావేశమయ్యారు. వ్యాక్సిన్‌ పంపిణీపై చర్చించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు భాగస్వామ్యులు కావాలని సూచించారు. వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత ఎవరికైనా రియాక్షన్‌ ఉంటే వారికి వెంటనే వైద్య చికిత్స అందించేందుకు వీలుగా వ్యాక్సిన్‌ సెంటర్‌కు అనుబంధంగా ఒక గదిని, వైద్యులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని, అంబులెన్స్‌ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో కాల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.. వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియలో కూడా కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు.

ఇవి కూడా చదవండి :

Lamba Investigation : ఆన్‌లైన్ లోన్ యాప్ మనీ దందా వెనుక ఓ మహిళ.. తీగ లాగుతున్న సైబర్‌క్రైమ్‌ పోలీసులు

ఒక్కప్పుడు అవి వస్తే గ్రామాల్లో పండుగ.. ఇప్పుడు వస్తున్నాయంటేనే అక్కడివారిలో వణుకు

Gold Trader Sukesh Gupta : బంగారం వ్యాపారి సుఖేష్‌ గుప్తాకు షాక్.. ఈడీ సమన్లపై స్టే ఇవ్వాలేమన్న హైకోర్టు