బ్రేకింగ్: ఉత్తరప్రదేశ్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి..!

Uttarpradesh: Blast In House Storing illegal Crackers, బ్రేకింగ్: ఉత్తరప్రదేశ్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి..!

ఉత్తరప్రదేశ్‌ ఇటావాలోని అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. పేలుడులో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. భవనం కింద చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *