బ్రేకింగ్: దొరికిన బోటు ఆచూకీ..! మూడు సుడిగుండాలు అడ్డు..

Uttarakhand NDRF team found boat Location in river Godavari, బ్రేకింగ్: దొరికిన బోటు ఆచూకీ..! మూడు సుడిగుండాలు అడ్డు..

కొద్దిరోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరి వద్ద బోటు మునిగి ఇప్పటికి నాలుగు రోజులవుతోంది. అప్పటి నుంచి.. సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. కాగా.. ఈ తెల్లవారుజామున బోటు ఆచూకీని కనిపెట్టినట్టు ఎన్టీఆర్ఎఫ్ సహాయక బృందాలు తెలిపాయి. 214 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించారు. బోటు వెలికితీతకు వెయ్యి మీటర్ల పొడవైన తాడు అవసరమని.. ఈ రోజు కాకినాడ నుంచి తాడును తెప్పించనున్నట్లు అధికారులు తెలిపారు. బోటు మునిగిన చోట ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. అక్కడ మూడు సుడిగుండాలు ఉన్న కారణంగా సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని.. సహాయకచర్యలకు ప్రకృతి సహకరించడంలేదని.. అధికారులు పేర్కొన్నారు. కాగా.. మరోవైపు మృతదేహాల కోసం కొనసాగుతోన్న గాలింపు చర్యలు. ఇప్పటి వరకు 34 మృతదేహాలు వెలికి తీసినట్లు.. మరో 13 మంది ఆచూకీ కోసం మ్ముమర గాలింపు చర్యలు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సీఎం జగన్ ఆరా తీస్తున్నారు.

Uttarakhand NDRF team found boat Location in river Godavari, బ్రేకింగ్: దొరికిన బోటు ఆచూకీ..! మూడు సుడిగుండాలు అడ్డు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *