ఓఎస్డీకి కరోనా తేలడంతో క్వారంటైన్ లోకి వెళ్లిన సీఎం

కరోనా మహమ్మారి జనాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. సామాన్యుడి నుంచి సెలబ్రెటీల దాకా కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ మరోసారి హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. తాజాగా తన ఓఎస్డీకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో మూడు రోజుల పాటు సీఎం క్వారంటైన్‌లో ఉండనున్నట్టు అధికారికవర్గాలు తెలిపాయి.

ఓఎస్డీకి కరోనా తేలడంతో క్వారంటైన్ లోకి వెళ్లిన సీఎం
Follow us

|

Updated on: Sep 03, 2020 | 7:03 AM

కరోనా మహమ్మారి జనాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. సామాన్యుడి నుంచి సెలబ్రెటీల దాకా కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ మరోసారి హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. తాజాగా తన ఓఎస్డీకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో మూడు రోజుల పాటు సీఎం క్వారంటైన్‌లో ఉండనున్నట్టు అధికారికవర్గాలు తెలిపాయి. దీంతో గురువారం జరగాల్సి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సైతం వాయిదా పడింది. గతంలో తన సలహాదారులకు వైరస్‌ సోకడంతో ఆగస్టు 25న సీఎం హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. దీంతో ఆగస్టు 26న జరగాల్సిన కేబినెట్‌ సమావేశాన్ని వాయిదా వేసుకుని సీఎం క్వారంటెన్ లోకి వెళ్లారు. ఆగస్టు 30న నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో తనకు నెగెటివ్‌గా తేలడంతో సెల్ఫ్‌ క్వారంటైన్‌ నుంచి రావత్‌ బయటకు వచ్చారు.

ఇదే క్రమంలోనే సెప్టెంబర్‌ 2న రాష్ట్ర కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా ఆయన ఓఎస్డీ కొవిడ్‌ బారినపడటంతో సీఎం మళ్లీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఈ రోజు జరగాల్సిన కేబినెట్‌ భేటీ వాయిదా పడింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20,398 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 14,076మంది కోలుకోగా.. 280మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6042 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.