ఉత్తమప్రదేశ్‌గా ఉన్నది కాస్త హత్యాప్రదేశ్‌గా మారింది : అఖిలేశ్

యూపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం నేర రేటును తగ్గించడంలో విఫలమైందని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రం హత్యలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతంగా పేరు పొందిందని ఎద్దేవా చేశారు. సహరన్‌పూర్‌లో ఓ జర్నలిస్టు సహా అతడి సోదరుడి హత్య నేపథ్యంలో అఖిలేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్.. ఉత్తమప్రదేశ్‌గా ఉండేదని.. ఇప్పుడు అది కాస్త హత్యాప్రదేశ్‌గా మారిందన్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 4:24 am, Mon, 19 August 19
Akhilesh Yadav