ప్రియురాలి కోసం ఫ్యామిలినే చంపించాడు…

ప్రియురాలు మాయ మాటలకు మోసపోయి.. అయినవారిని అనంతలోకాలకు పంపించాడు. ఆస్తి పై కన్నేసిన దుర్మార్గాన్ని గ్రహించలేక.. చేసిన పనికి కటకటాలపాలయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.. ప్రయాగరాజ్‌లో వ్యాపారవేత్త తులసీదాస్ (65), ఆయన భార్య కిరణ్ (60), కూతురు నీహారిక (37), కోడలు ప్రియాంక (22)లు దారుణ హత్యకు గురయ్యారు. ప్రయాగరాజ్ ప్రాంతంలోని ధుమన్‌గంజ్ లో కొన్నేళ్లు తులసీదాస్ నివాసముంటున్నారు. తెల్లవారు జామున ఇంటికి చేరుకున్న తులసీదాస్ కుమారుడు […]

ప్రియురాలి కోసం ఫ్యామిలినే చంపించాడు...
Follow us

|

Updated on: May 16, 2020 | 1:41 PM

ప్రియురాలు మాయ మాటలకు మోసపోయి.. అయినవారిని అనంతలోకాలకు పంపించాడు. ఆస్తి పై కన్నేసిన దుర్మార్గాన్ని గ్రహించలేక.. చేసిన పనికి కటకటాలపాలయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది..

ప్రయాగరాజ్‌లో వ్యాపారవేత్త తులసీదాస్ (65), ఆయన భార్య కిరణ్ (60), కూతురు నీహారిక (37), కోడలు ప్రియాంక (22)లు దారుణ హత్యకు గురయ్యారు. ప్రయాగరాజ్ ప్రాంతంలోని ధుమన్‌గంజ్ లో కొన్నేళ్లు తులసీదాస్ నివాసముంటున్నారు. తెల్లవారు జామున ఇంటికి చేరుకున్న తులసీదాస్ కుమారుడు ఆతీష్ ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లోకి ప్రవేశించిన దుండుగులు ముందుగా తులసీదాస్ ను ఆయన భార్య కిరణ్, కూతురు నిహారిక, కొడలు ప్రియాంకను కత్తులతో అతిదారుణంగా హత్య చేశారు. పోలీసుల విచారణలో ఆసక్తికర నిజాలు బయటపడడంతో తులసీదాస్ కుమారుడు ఆతీష్, అతని ప్రియురాలు రంజన శుక్లాతో పాటు కిరాయి హంతకుడు అనుజ్ శ్రీవాస్త గ్యాంగ్ ను అరెస్టు చేశారు.

ఇక పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం తులసీదాస్ కొడుకు ఆతిష్ అదే ప్రాంతానికి చెందిన రంజన శుక్లా కొద్దికాలంగా ప్రేమించకుంటున్నారు. ఆతీష్ కోట్ల ఆస్తికి వారసుడు. అతనికి ప్రియాంకతో వివాహం కూడా జరిగింది. పెళ్లైన ఆతీష్ ను తన వశం చేసుకోవాలని భావించింది రంజన. ఆతీష్ భార్య ప్రియాంకతో సహా కుటుంబసభ్యులను హతమారిస్తే అస్తి మొత్తం ఇద్దరి సొంతమవుతుందని భావించింది. ఈ హత్యలు చేయించేలా ఆతిష్‌ను ప్రేరేపించింది. హత్యల తర్వాత… ఆతిష్‌కి దక్కే కోట్ల ఆస్తిని తాను అనుభవించాలనుకుంది. కిరాయి హంతకుడు అనుజ్ శ్రీవాస్తవను ఎంచుకున్నారు. అతనికి రూ.8 లక్షల సుఫారీ ఇచ్చి బేరం కుదుర్చుకున్నారు. తీరా చూస్తే… ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులు అనుజ్ శ్రీవాస్తతో పాటు అతనికి సాయం చేసిన ఉమేంద్ర ద్వివేదీని, ఆతిష్, ప్రేయసి రంజన శుక్లా కూడా అరెస్టు చేశారు పోలీసులు. అనుజ్ నుంచి కొన్ని బంగారు నగలు, రూ.1 లక్ష డబ్బు, ఓ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు… సఫారీ గ్యాంగ్ వాడిన కత్తి, కారును కూడా సీజ్ చేశారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?