టీఆర్ఎస్ ప్రలోభాలకు చెక్: ఈసీకి ఉత్తమ్ వినతి

జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్‌ల ఎంపికపై ఈసీకి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 40 రోజుల గ్యాప్ వల్ల టీఆర్ఎస్ పార్టీ ప్రజలను ప్రలోభాలకు గురి చేసే అవకాశముందని అన్నారు. ఫలితాలు ప్రకటించిన మూడు రోజుల్లో చైర్మన్‌ల ఎంపిక జరిగేలా చూడాలని కోరినట్టు తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈసీని కోరామన్నారు ఉత్తమ్. చట్టాల పట్ల కేసీఆర్‌కు గౌరవం లేదని.. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, ఛైర్మన్‌ల ఎంపిక పారదర్శకంగా […]

టీఆర్ఎస్ ప్రలోభాలకు చెక్: ఈసీకి ఉత్తమ్ వినతి
Follow us

| Edited By:

Updated on: May 17, 2019 | 6:07 PM

జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్‌ల ఎంపికపై ఈసీకి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 40 రోజుల గ్యాప్ వల్ల టీఆర్ఎస్ పార్టీ ప్రజలను ప్రలోభాలకు గురి చేసే అవకాశముందని అన్నారు. ఫలితాలు ప్రకటించిన మూడు రోజుల్లో చైర్మన్‌ల ఎంపిక జరిగేలా చూడాలని కోరినట్టు తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈసీని కోరామన్నారు ఉత్తమ్. చట్టాల పట్ల కేసీఆర్‌కు గౌరవం లేదని.. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, ఛైర్మన్‌ల ఎంపిక పారదర్శకంగా జరిగేలా చూడాలని ఈసీని అభ్యర్థించినట్టు ఉత్తమ్ చెప్పారు.