Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

ఉత్తమ్ ఇక ఊపిరి పీల్చుకో.. ప్రస్తుతానికి మీరే ప్రెసిడెంట్ !

uttam to continue as tpcc president, ఉత్తమ్ ఇక ఊపిరి పీల్చుకో.. ప్రస్తుతానికి మీరే ప్రెసిడెంట్ !
అజాద్ వచ్చారు.. ఆశావహుల ఆశలపై నీళ్ళు చల్లారు.. కుంతియా వచ్చారు… కుతూహలంగా వున్న వారి ప్రయత్నాలకు బ్రేకేసేశారు. ఇంతకీ ఏంటీ మేటర్ అనుకుంటున్నారా ? నిజమే.. వరుస ఓటముల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో మార్పు ఖాయమనుకున్నారంతా. ఇటీవల సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌ను కూడా కాపాడుకోలేకపోయిన ఉత్తమ్ కుమార్‌కు ఉద్వాసన ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. కానీ రెండు, మూడురోజుల్లో సీన్ మారిపోయింది.
హుజూర్‌నగర్ ఓటమి తర్వాత గాంధీభవన్‌లో ఒకటే డిస్కషన్‌. టిపిసిసి సీటు ఖాళీ అవుతోందని. కానీ ఆ సీటులోకి ఎవరు వస్తారు?. కుర్చీ ఖాళీ అయితే కూర్చునేందుకు డజన్‌ మంది రెడీ అయ్యారు. వారిలో ఎవరిని అదృష్టం వరిస్తుందనే అంశంపై సస్పెన్స్‌ నడిచింది కొంతకాలం. అందరివాడి ఎంపిక కోసం ఆజాద్‌ హైదరాబాద్‌ వచ్చారని కూడా చెప్పుకున్నారు.  ఆయన ఇచ్చే రిపోర్టే కీలకమని కూడా అనుకున్నారు. కానీ సీన్ మారిపోయింది.
ఆజాద్ అటు వెళ్ళారో లేదో ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా వచ్చారు. ఆయనా రోజంతా పార్టీ సీనియర్లతో గాంధీభవన్ వేదికగా మంతనాలు సాగించారు. త్వరలో మునిసిపల్ ఎన్నికలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో కార్మికులకు సంఘీభావంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి.. ఇలాంటి అంశాలపై చర్చలు, సమాలోచనలు జరిపి.. కీలకమైన సలహాలిచ్చారు. కార్యక్రమాల రూపకల్పనలో భాగస్తులయ్యారు.
ఇదంతా బాగానే వుంది.. మరి పిసిసి అధ్యక్ష రేసులో వున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, వి.హనుమంతరావు, సంపత్‌ కుమార్‌, జగ్గారెడ్డి, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు.. ఇలా మరికొందరి ఆశలపై మాత్రం ఎటూ తేల్చలేదు. దాంతో వీరిందరితోపాటు పార్టీ శ్రేణుల మధ్య ఇప్పుడు ఎవరినీ ఆ పదవి వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.  పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మార్పు ఖాయం అని మాత్రం కన్‌ఫామ్‌గా అనుకున్నారు. పీసీసీ చీఫ్‌ పదవి కోసం జోరుగా లాబీయింగ్‌ కూడా చేశారు.
ఆజాద్‌ ముందు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తిట్టుకున్నారు. పీసీసీ మార్పుపైనే ఈ గొడవ జరిగిందని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డికి పీసీసీ పదవి ఇప్పించేందుకు షబ్బీర్‌ అలీ ప్రయత్నిస్తున్నారని ఆయన మీద విహెచ్‌ మండిపడ్డారట. పీసీసీ సీటు కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. అధిష్టానం దూత ముందు ఎంపీ కోమటిరెడ్డి తన మనసులో మాట బయటపెట్టారట. పార్టీ కోసం యూత్‌ కాంగ్రెస్‌ నుండి నేటి వరకు పనిచేస్తున్నానని, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ… పార్టీని నడపగల సత్తా ఉన్నందున నాకే పీసీసీ ఇవ్వాలంటూ కోమటిరెడ్డి పార్టీ సీనీయర్ నేత గులాంనబీ ఆజాద్‌కు స్పష్టం చేశారట. తనకు పీసీసీ ఇస్తే రాష్ట్రంలో అధికారంలోకి తెస్తానని, సోనియాకు గిఫ్ట్‌ ఇస్తానంటూ కోరారు. కోమటిరెడ్డి అనుచరులు తమ నేతకే పీసీసీ ఇవ్వాలంటూ గాంధీభవన్‌లో కొద్దిసేపు హంగామా సృష్టించారు.
ఇటు మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు మరో వర్గం మద్దతు ఇస్తోంది. జగ్గారెడ్డి, సంపత్‌ కుమార్, కూడా తమకు చాన్స్‌ ఇవ్వాలని అడుగుతున్నారట. దీంతో  గాంధీభవన్‌ కా కుర్సీ ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఢిల్లీ నుంచి వచ్చి, వెళ్ళిన ఆజాద్, కుంతియాలిద్దరు ఇప్పుడప్పుడే పిసిసి మార్పు కొత్త సమస్యలు తెస్తుందన్న రిపోర్టును అధిష్టానం ముందుంచడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైనట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ తాజా నిర్ణయం ప్రకారం మునిసిపల్ ఎన్నికల తర్వాతనే తెలంగాణ పిసిసి అధ్యక్షుని ఎంపికపై అధిష్టానం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో జరగనున్న మునిపిసిల్ ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షున్ని మారిస్తే ఆయన కుదురుకోవడానికే సమయం పడుతుందని, దానికి తోడు పిసిసి అధ్యక్ష పదవి ఆశించి భంగ పడిన వారు కొత్త అధ్యక్షునికి సహకరించకపోవచ్చని ఆజాద్, కుంతియాలు అధిష్టానంతో చెప్పారని తెలుస్తోంది.
దాంతో కొత్త సమస్యలు కొని తెచ్చుకుని ఎన్నికల్లో భంగపడిన దానికంటే ప్రస్తుతానికి పిసిసి అధ్యక్షుని ఎంపికను తాత్కాలికంగా వాయిదా వేయడమే బెటర్ అని అధిష్టానం భావించినట్లు చెబుతున్నారు. సో.. మునిసిపల్ ఎన్నికల తర్వాతనే టిపిసిసికి కొత్త అధ్యక్షుని రాక అని ఖరారైందనే భావించాలి.