ఎమ్మెల్సీ ఎన్నికల్లో నర్సిరెడ్డి విజయం..

వరంగల్‌ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్ధికి షాక్‌ తగిలింది. ఆ పార్టీ బలపరిచిన తెలంగాణ పీఆర్టీయూ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆయనపై తెలంగాణ యూటీఎఫ్‌ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయ కేతనం ఎగురవేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 18,885 ఓట్లు పోలవ్వగా…మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి నర్సిరెడ్డికి 8954 ఓట్లు , రవీందర్‌కు 6218 ఓట్లు పోల్ అయ్యాయి. 2736 ఓట్ల ఆధిక్యంలో […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:01 pm, Tue, 26 March 19

వరంగల్‌ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్ధికి షాక్‌ తగిలింది. ఆ పార్టీ బలపరిచిన తెలంగాణ పీఆర్టీయూ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆయనపై తెలంగాణ యూటీఎఫ్‌ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయ కేతనం ఎగురవేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 18,885 ఓట్లు పోలవ్వగా…మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి నర్సిరెడ్డికి 8954 ఓట్లు , రవీందర్‌కు 6218 ఓట్లు పోల్ అయ్యాయి. 2736 ఓట్ల ఆధిక్యంలో నర్సిరెడ్డి ఉన్నారు. అయితే, ఫలితాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల సంఘం అనుమతి వచ్చాకే నర్సిరెడ్డి గెలుపుపై ప్రకటన చేయనున్నారు.

గత ఎన్నికల్లో పూల రవీందర్‌ టీఆర్ఎస్ అభ్యర్థి వరదారెడ్డిపై విజయం సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో రవీందర్‌కు ఉన్నత విద్య జూనియర్‌ కళాశాల అధ్యాపక, ప్రిన్సిపల్‌ సంఘాలతో పాటు కాంట్రాక్టు లెక్చరర్లు మద్దతు ప్రకటించడంతో విజయం ఖాయమని అంతా భావించినా అనూహ్య ఫలితాలతో అంచనాలు తారుమారయ్యాయి.