డిజిటల్ సర్వీసులపై పన్ను.. ఇండియానూ ఇన్వెస్టిగేట్ చేస్తాం.. ట్రంప్

విదేశీ డిజిటల్ సర్వీసులపై పన్నుల విధింపు మీద ఇన్వెస్టిగేట్ చేయాలని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్నారు. బ్రిటన్, ఈయూ, ఇండోనేసియా, టర్కీతో బాటు ఇండియా కూడా ఈ దేశాల్లో...

డిజిటల్ సర్వీసులపై పన్ను.. ఇండియానూ ఇన్వెస్టిగేట్ చేస్తాం.. ట్రంప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 03, 2020 | 10:50 AM

విదేశీ డిజిటల్ సర్వీసులపై పన్నుల విధింపు మీద ఇన్వెస్టిగేట్ చేయాలని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్నారు. బ్రిటన్, ఈయూ, ఇండోనేసియా, టర్కీతో బాటు ఇండియా కూడా ఈ దేశాల్లో ఉంది. ఈ పన్నులు, తమ దేశ టెక్నాలజీ సంస్థలను ఉద్దేశించే విధించారని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది ఫ్రాన్స్ పై కూడా యిలాగే ట్రేడ్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. మన ట్రేడింగ్ భాగస్వామ్య దేశాల్లో చాలా దేశాలు యుఎస్  కంపెనీలపై అనుచిత పన్నుల విధింపు మార్గాలను అనుసరిస్తున్నాయని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్  రాబర్ట్ లిథిజర్ ఆరోపించారు. మా బిజినెస్ లను, మా సిబ్బందిని రక్షించుకునేందుకు అన్ని చర్యలూ తీసుకోవడానికి తాము రెడీగా ఉన్నామన్నారు. ఆన్ లైన్ సేల్స్ నుంచి వచ్ఛే రెవెన్యులపై పన్నుల విధింపును అమెరికా వ్యతిరేకిస్తోంది. దీనివల్ల గూగుల్, యాపిల్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి సంస్థలను ఈ దేశాలు ఏకాకులను చేస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇండియా వంటి వర్ధమాన దేశాన్ని కూడా ట్రంప్ టార్గెట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓ వైపు భారత ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడు అంటూనే ఆయన ఈ యోచన చేయడం విడ్డూరంగా ఉంది.