ఇండియాతో చెలిమి, చైనాతో కయ్యం, అమెరికా విదేశాంగ మంత్రి కానున్న ఆంటోనీ బ్లింకెన్ కామెంట్స్

అమెరికా విదేశాంగ మంత్రిగా పదవి చేపట్టనున్న ఆంటోనీ బ్లింకెన్ అప్పుడే ఇండియా అనుకూల వ్యాఖ్యలు చేశారు. భారత, అమెరికా దేశాలకు ఓ ఉమ్మడి సవాల్ ఉందని, అదే చైనా దేశమని ఆయన అన్నారు.

ఇండియాతో చెలిమి, చైనాతో కయ్యం, అమెరికా విదేశాంగ మంత్రి కానున్న ఆంటోనీ బ్లింకెన్  కామెంట్స్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 26, 2020 | 1:09 PM

అమెరికా విదేశాంగ మంత్రిగా పదవి చేపట్టనున్న ఆంటోనీ బ్లింకెన్ అప్పుడే ఇండియా అనుకూల వ్యాఖ్యలు చేశారు. భారత, అమెరికా దేశాలకు ఓ ఉమ్మడి సవాల్ ఉందని, అదే చైనా దేశమని ఆయన అన్నారు. భారత వాస్తవాధీన రేఖ వద్ద ఆక్రమణతో సహా ప్రపంచ వ్యాప్తంగా  పెరుగుతున్న చైనా దూకుడును అడ్డుకోవలసి ఉందని ఆయన చెప్పారు. ఇందుకు ఇండియా. అమెరికా పూనుకోవలసి ఉందని పేర్కొన్నారు. లడాఖ్ లోని నియంత్రణ రేఖ వద్ద భారత,చైనా దేశాలమధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆంటోనీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ దేశాధ్యక్షునిగా జో బైడెన్ పదవిని స్వీకరించిన అనంతరం భారత దేశంతో సన్నిహిత సంబంధాల కోసం కృషి చేస్తారని, రెండు దేశాల మధ్య ప్రజాస్వామిక బంధాలను మరింత బలోపేతం చేస్తారని ఆయన అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకోసం భావసారూప్యం గల భాగస్వాములతో  జరుపుతున్న కృషిలో ఇండియా పాత్ర ప్రశంసనీయమన్నారు.

ఆగస్టు 15 న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బైడెన్ ప్రచార వర్గం ఇండో-అమెరికన్లతో నిర్వహించిన కార్యక్రమంలో ఆంటోనీ మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ వైఖరిని ఆయన దుయ్యబట్టారు.