31 రాష్ట్రాల్లో సడలింపులు..బిజీబిజీగా బీచ్‌లు, రెస్టారెంట్లు

దాదాపు 31 రాష్ట్రాల్లో తిరిగి కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆయా రాష్ట్రాల గవర్నర్లు లాక్‌డౌన్‌ నిబంధనలు దాదాపు పూర్తిగా సడలించారు. దీంతో పెద్దఎత్తున జనం ఎగబడుతున్నారు.

31 రాష్ట్రాల్లో సడలింపులు..బిజీబిజీగా బీచ్‌లు, రెస్టారెంట్లు
Follow us

|

Updated on: May 04, 2020 | 10:56 AM

అగ్ర‌రాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా కారణంగా ఇప్పటికే వేలాదిమంది మరణించటం తెలిసిందే. అగ్రరాజ్యానికి పీడకలలా చెప్పుకునే వియత్నాం యుద్ధ సమయంలో కోల్పోయిన మరణాలకు మించిన రీతిలో కరోనా మరణాలు ఉంటాయన్న అంచనాలు వ్యక్తం కావటం తెలిసిందే. దాదాపు లక్ష మంది అమెరికన్లు కరోనా కారణంగా మరణిస్తారన్న అంచనాల్ని ఆ దేశాధ్యక్షుడు ట్రంపే స్వయంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే, కొన్ని అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

అమెరికాలో మళ్లీ సందడి మొదలైంది. దాదాపు 31 రాష్ట్రాల్లో తిరిగి కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆయా రాష్ట్రాల గవర్నర్లు లాక్‌డౌన్‌ నిబంధనలు దాదాపు పూర్తిగా సడలించారు. ఫ్లోరిడా, క్యాలిఫోర్నియా, న్యూయార్క్‌లలో రోడ్లన్నీ బిజీబిజీగా కనిపిస్తున్నాయి. కిక్కిరిసిన జన సమూహాలు బీచ్‌లు, రెస్టారెంట్లు, పార్క్‌లు కోలాహాలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే లక్షా 20 వేల మందికి పైగా కరోనా వైరస్‌ బారిన పడి, 68 వేల మందికి పైగా మృతి చెందినప్పటికీ, అమెరికా పౌరులు స్వేచ్ఛగా తిరిగేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రజల మూడ్‌ను గమనించిన ఆయా రాష్ట్రాల గవర్నర్లు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించారు.

ఇప్పటికే చిన్న చిన్న వ్యాపారాలు మొదలయ్యాయి. కార్యాలయాలకు మళ్లీ జనకళ వచ్చేసింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా బీచ్‌లలో సందడి కనిపిస్తోంది. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన, నగరం మియామీ మళ్లీ కేసినోలతో సందడి చేస్తోంది. ఫ్లోరిడాలో అన్ని రెస్టారెంట్లలో 25 శాతం కెపాసిటీతో ప్రారంభించడానికి అనుమతించగా, పెద్దఎత్తున జనం ఎగబడుతున్నారు. క్యాలిఫోర్నియాలో అధికారికంగా ఇంకా సడలింపులు రాకపోయినప్పటికీ, జనం ఏమాత్రం పట్టించుకోకుండా యదేచ్ఛగా తిరుగుతున్నారు. మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. సియాటిల్‌లో మార్కెట్లు రెండు నెలల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. టెక్సాస్‌లో వేలాది మంది బీచ్‌లలో సందడి చేస్తుండగా, వర్జీనియాలో గోల్ఫ్‌ మైదానాలు నిండిపోయాయి. న్యూయార్క్‌లోని రెండు అతి పెద్ద పార్క్‌లు సెంట్రల్‌, ప్రాస్పెక్ట్‌లు రద్దీగా కనిపిస్తున్నాయి.

సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం