త్వరలో అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు భారత్ రాక

అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు మార్క్ ఎస్పర్, మైక్ పాంపియో వచ్ఛేవారం ఇండియాను సందర్శించనున్నారు. చైనా నుంచి వ్యూహాత్మక సవాలు ఎదురవుతున్న నేపథ్యంలో వీరి ఇండియా పర్యటన అత్యంత ప్రాధాన్యం…

  • Umakanth Rao
  • Publish Date - 2:40 pm, Wed, 21 October 20

అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు మార్క్ ఎస్పర్, మైక్ పాంపియో వచ్ఛేవారం ఇండియాను సందర్శించనున్నారు. చైనా నుంచి వ్యూహాత్మక సవాలు ఎదురవుతున్న నేపథ్యంలో వీరి ఇండియా పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుంది. భారత, అమెరికా దేశాలమధ్య సహకారాన్ని మరింత పెంచుకోవలసి ఉందని వీరంటున్నారు. రష్యా, చైనా దేశాలు తమ సొంత గ్లోబర్ పవర్ నెట్ వర్క్ ను పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయని, ఈ తరుణంలో ఇండియాతో తమ పాత స్నేహాన్ని పటిష్టం చేసుకోవడంతో బాటు కొత్తగా సహకారాన్ని ఇంకా పెంచుకోవాల్సి ఉందని మార్క్ ఎస్పర్ అన్నారు. లడాఖ్ లో ఇండియా… చైనాతో ఉద్రిక్త పరిస్థితిని ఎదుర్కొంటున్నదని ఆయన పేర్కొన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో  ఎంతోమంది ప్రతిభ గల వ్యక్తులున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా-వీరి రాక ఖరారైతే ఇండియా ఇప్పటినుంచే భద్రతను పటిష్టపరచ వలసి ఉంటుంది.