Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

అభివృధ్ది సరే ! జమ్మూ కాశ్మీర్ విషయమేంటి ? అమెరికా ‘ ఆందోళన ‘

us says it supports india s objectives but concerned over kashmir situation, అభివృధ్ది సరే ! జమ్మూ కాశ్మీర్ విషయమేంటి ? అమెరికా ‘ ఆందోళన ‘

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికణం రద్దు వెనుక భారత ప్రభుత్వ ‘ అభివృధ్ది అజెండా ‘ ఏమిటో తమకు తెలుసునని అమెరికా అంటోంది. అయితే ఆ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితి పట్ల తాము ఆందోళన చెందుతున్నామని యుఎస్ చెబుతోంది. కాశ్మీర్ లోని పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని దక్షిణాసియా, సెంట్రల్ ఆసియా వ్యవహారాలపై గల అమెరికా విదేశాంగ శాఖలోని తాత్కాలిక కార్యదర్శి అలీస్ వెల్స్ తెలిపారు. 370 ఆర్టికల్ రద్దుతో బాటు కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్టు 5 న భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృధ్ది చెందాలని, అవినీతిని అదుపు చేయాలని, ఈ దేశ చట్టాలన్నీ ఉమ్మడిగా ఈ స్టేట్ కు వర్తింపజేయాలని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ముఖ్యంగా కాశ్మీర్లో మహిళలు, మైనారిటీల అభివృద్ధే ధ్యేయమని పేర్కొంది. ఈ ప్రకటన నేపథ్యంలోనే తాము కాశ్మీర్లోని పరిస్థితిని అధ్యయనం చేస్తున్నట్టు అలీస్ వెల్స్ అంటున్నారు. ఈ లక్ష్యాలన్నిటికీ మేం మద్దతు తెలుపుతున్నాం.. కానీ ఆ రాష్ట్రంలోని పరిస్థితే మాకు ఆందోళన కలిగిస్తోంది అని ఆమె వివరించారు. ఆగస్టు 5 నుంచి కాశ్మీర్లో సుమారు 80 లక్షల మంది ప్రజలపై భారత ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం పడిందని ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఓ స్టేట్ మెంట్ ను అలీస్ కాంగ్రెస్ సభ్యులతో కూడిన కమిటీకి సమర్పించారు. ‘ దక్షిణాసియాలో మానవ హక్కులు-విదేశాంగ శాఖ అభిప్రాయాలు ‘ అన్న అంశంపై ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది.
us says it supports india s objectives but concerned over kashmir situation, అభివృధ్ది సరే ! జమ్మూ కాశ్మీర్ విషయమేంటి ? అమెరికా ‘ ఆందోళన ‘
జమ్మూ, లడఖ్ ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగు పడినప్పటికీ.. కాశ్మీర్ లోయలో మాత్రం ఇంకా సాధారణ పరిస్థితులు ఏర్పడలేదని అలీస్ విచారం వ్యక్తం చేశారు. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులతో బాటు పలువురు రాజకీయ నేతలను, ఇతర ప్రముఖులను భారత ప్రభుత్వం నిర్బంధించడం ఆందోళనకరంగా ఉంది అని ఆమె అన్నారు. మానవ హక్కులను గౌరవించాలని, ఇంటర్నెట్, మొబైల్ నెట్ వర్క్ లను, ఇతర ప్రజా సేవలను పునరుధ్ధరించాలని కోరుతున్నామన్నారు. కాశ్మీర్లో పోస్ట్ పెయిడ్ మొబైల్ సర్వీసులను పునరుధ్ధరించినప్పటికీ, ఇంటర్నెట్ యాక్సెస్ పై ఇంకా ఆంక్షలున్నాయని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని విదేశీ, స్థానిక జర్నలిస్టులు అన్ని అంశాలనూ కవర్ చేస్తున్నా.. సెక్యూరిటీ ఆంక్షల ఫలితంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారు అని అలీస్ తెలిపారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద అనేకమందిని అదుపులోకి తీసుకున్నారని, వీరిలో చాలామందిపై ఎలాంటి అభియోగాలు లేనట్టు తెలిసిందని అన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ళు, ప్రారంభమైనా .. విద్యార్థుల హాజరీ చాలా తక్కువగా ఉందన్నారు. కాశ్మీర్ కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై భారత సుప్రీంకోర్టు నవంబర్ 14 న విచారణ జరపబోతోంది.. అలాగే జమ్మూకాశ్మీర్ హైకోర్టు పెండింగులో ఉన్న కేసులను సమీక్షిస్తోంది అని అలీస్ వెల్స్.. మన దేశంలోని మేధావులకు తెలిసిందానికన్నా ఎక్కువ తెలిసినదానిలా వివరించింది. సాధ్యమైనంత త్వరగా ఎస్సెమ్మెస్ లతో సహా ఇంటర్నెట్ సర్వీసులను పునరుధ్ధారించాలని ఆమె మళ్ళీ మళ్ళీ కోరారు. us says it supports india s objectives but concerned over kashmir situation, అభివృధ్ది సరే ! జమ్మూ కాశ్మీర్ విషయమేంటి ? అమెరికా ‘ ఆందోళన ‘

భారత్-పాక్ చర్చలు జరపాల్సిందే !

1972 నాటి సిమ్లా ఒప్పందం నేపథ్యంలో భారత, పాకిస్తాన్ దేశాలమధ్య నేరుగా చర్చలు జరగాలన్న ప్రతిపాదనను తాము సమర్థిస్తున్నామని అమెరికా కోరింది. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న టెర్రరిస్టులకు పాక్ ఇంకా మద్దతునిస్తున్నందున ఇదే చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారిందని అలీస్ అభిప్రాయపడ్డారు. 2006.. 07 మధ్య కాలంలో ఆ రెండు దేశాలు కాశ్మీర్ పై చర్చల విషయంలో ఎంతో పురోగతి సాధించాయి.. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడాలని కోరుతున్నాం అన్నారు.. ‘ ఏది సాధ్యం అన్నదాన్ని చరిత్ర చెబుతోంది ‘ అని ఆమె వ్యాఖ్యానించారు.
భారత, పాకిస్థాన్ దేశాలు ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించాలని మళ్ళీ మళ్ళీ అభ్యర్థిస్తున్నాం అన్నారు. కాశ్మీర్లో హింసను ప్రేరేపిస్తున్న తమ దేశ ఉగ్రవాదులు అటు కాశ్మీరీలకు, ఇటు పాకిస్థాన్ కు కూడా శత్రులేనని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనపట్ల అలీస్ హర్షం వ్యక్తం చేశారు. కాశ్మీరీలు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ.. ఉగ్రవాదులు హింసకు పాల్పడుతూ చర్చలకు అడ్డంకిగా మారడాన్ని ఖండిస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు.