వీడియో: కరుడుగట్టిన ఉగ్రవాది బాగ్దాదీని ఎలా తుదముట్టించారంటే..?

అమెరికా భద్రతా దళాలు జరిపిన దాడుల్లో ఐసిస్ ఉగ్రసంస్థ అధినేత అబూ బకర్‌ హతమైన విషయం తెలిసిందే. ఆపరేషన్ ముల్లెర్ పేరిట తాము చేసిన దాడుల్లో కరుడుగట్టిన ఉగ్రవాది అబూ బకర్ కుక్క చావు చచ్చాడంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా అబూ బకర్‌ నివాసాన్ని అమెరికా దళాలు ముట్టడించడం, అతడి స్థావరంపై వైమానిక దళాలు చేసిన దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను.. ఆ దేశ రక్షణశాఖ తాజాలు విడుదల చేసింది. ఆ వీడియోలు, […]

వీడియో: కరుడుగట్టిన ఉగ్రవాది బాగ్దాదీని ఎలా తుదముట్టించారంటే..?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 31, 2019 | 10:22 AM

అమెరికా భద్రతా దళాలు జరిపిన దాడుల్లో ఐసిస్ ఉగ్రసంస్థ అధినేత అబూ బకర్‌ హతమైన విషయం తెలిసిందే. ఆపరేషన్ ముల్లెర్ పేరిట తాము చేసిన దాడుల్లో కరుడుగట్టిన ఉగ్రవాది అబూ బకర్ కుక్క చావు చచ్చాడంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా అబూ బకర్‌ నివాసాన్ని అమెరికా దళాలు ముట్టడించడం, అతడి స్థావరంపై వైమానిక దళాలు చేసిన దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను.. ఆ దేశ రక్షణశాఖ తాజాలు విడుదల చేసింది.

ఆ వీడియోలు, ఫొటోలు బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నప్పటికీ.. అమెరికా దళాలు బాగ్దాదీని చుట్టుముట్టేందుకు వెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దళాలు బాగ్దాదీని పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో కొందరు దుండగులు హెలికాఫ్టర్‌లపై కాల్పులు చేయగా.. వెంటనే అప్రమత్తమైన దళాలు వారిపై వైమానిక దాడులు చేసేందుకు సిద్ధమైన ఫొటోలను చూడొచ్చు.

కాగా ఈ ఆపరేషన్ గురించి యూఎస్ సెంట్రల్ కమాండర్ జనరల్ కెన్నెత్ మెక్‌కెంజీ మాట్లాడుతూ.. ట్రంప్ చెప్పినట్లు.. అబూ బకర్‌కు చెందిన ముగ్గురు పిల్లలు చనిపోలేదని.. కేవలం ఇద్దరు మాత్రమే మరణించారని పేర్కొన్నారు. ఆ పిల్లలిద్దరు 12 ఏళ్లకు లోపలి వాళ్లేనని ఆయన తెలిపారు. ఇక బాగ్దాదీ ఆత్మాహుతి దాడి చేసుకునే సమయంలో అక్కడే ఉన్న మరో నలుగురు మహిళలు, ఒక పురుషుడు కూడా చనిపోయారని.. వీరితో పాటు తాము జరిపిన వైమానిక దాడుల్లో కొంతమంది బాగ్దాదీ గుంపు కూడా మరణించారని ఆయన పేర్కొన్నారు. ఇక దాడులు ముగిసిన తరువాత బాగ్దాదీకి చెందిన పలు డాక్యుమెంట్లు, ఎలక్ట్రిక్ వస్తువులను సొంతం చేసుకున్నట్లు మెక్‌కంజీ చెప్పుకొచ్చారు. అంతేకాదు అబూ బకర్ మరణంతో ఐసిస్ మరణించినట్లు కాదని.. ఆ ఉగ్రసంస్థ భావజాలాలు ఇంకా సజీవంగా ఉన్నాయని మెక్‌కంజీ వివరించారు.