కరోనా వేళ చేదోడు వాదోడు..భారత్​కు అమెరికా ఆర్థిక సాయం

కరోనాతో ప్ర‌స్తుతం ప్ర‌పంచం అత‌లాకుతలం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోని 200పైగా దేశాలు ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో క‌రోనా క‌ట్ట‌డిలో తీవ్ర చ‌ర్య‌లు తీసుకుంటున్న భారత్‌కు ఆర్థిక సాయం ప్రకటించింది అగ్ర‌రాజ్యం అమెరికా. యూఎస్​ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్‌ఏఐడీ) ద్వారా 5.9 మిలియన్‌ డాలర్లను ఇవ్వనుంది. కోవిడ్ బాధితులకు ట్రీట్మెంట్, ఇతర సాయం అందించడం, కొత్త కేసులు కనుగొనడం, ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవసరమైన ప్ర‌చార‌ కార్య‌క్ర‌మాలు, నిఘాను […]

కరోనా వేళ చేదోడు వాదోడు..భారత్​కు అమెరికా ఆర్థిక సాయం
Follow us

|

Updated on: Apr 17, 2020 | 2:20 PM

కరోనాతో ప్ర‌స్తుతం ప్ర‌పంచం అత‌లాకుతలం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోని 200పైగా దేశాలు ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో క‌రోనా క‌ట్ట‌డిలో తీవ్ర చ‌ర్య‌లు తీసుకుంటున్న భారత్‌కు ఆర్థిక సాయం ప్రకటించింది అగ్ర‌రాజ్యం అమెరికా. యూఎస్​ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్‌ఏఐడీ) ద్వారా 5.9 మిలియన్‌ డాలర్లను ఇవ్వనుంది.

కోవిడ్ బాధితులకు ట్రీట్మెంట్, ఇతర సాయం అందించడం, కొత్త కేసులు కనుగొనడం, ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవసరమైన ప్ర‌చార‌ కార్య‌క్ర‌మాలు, నిఘాను మరింత పటిష్ఠం చేయడం వంటి చర్యలు చేపట్టేందుకు ఈ నిధుల్ని భారత్​ ఉపయోగించాలని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. గత 20 ఏళ్లలో అమెరికా దాదాపు 2.8 బిలియన్ల డాలర్లను ఇండియాకు సాయం అందించింది. ఇందులో 1.4 బిలియన్ల డాలర్లు వైద్య సాయం కింద ఇచ్చింది. కాగా క‌రోనాపై పోరాటంలో కీలకంగా చెబుతున్న ఔషధం హెడ్రాక్సీ క్లోరీక్విన్‌ను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వినతి మేరకు ఆ దేశానికి భార‌త్ ఇటీవ‌ల‌ ఎగుమతి చేసిన సంగ‌తి తెలిసిందే.