అమెరికా.. నల్ల జాతీయుని హత్య.. పేట్రేగిన అల్లర్లు.. సైన్యాన్ని దింపనున్న ట్రంప్

డెట్రాయిట్ నగరానికి ఇవి వ్యాపించాయి. రాత్రి కర్ఫ్యూను కూడా ఉల్లంఘించి ఆందోళనకారులు ఈ నగరాల్లో హింసాకాండకు దిగారు. డెట్రాయిట్ లో శనివారం ఉదయం నిరసనకారుల గుంపు మీద ఓ అజ్ఞాత వ్యక్తి జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ళ యువకుడు మరణించాడు...

అమెరికా.. నల్ల జాతీయుని హత్య.. పేట్రేగిన అల్లర్లు.. సైన్యాన్ని దింపనున్న ట్రంప్
Follow us

|

Updated on: May 30, 2020 | 7:18 PM

జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ ని మినియాపొలీస్ సిటీకి చెందిన పోలీసు ఒకడు దారుణంగా హతమార్చిన ఘటన అమెరికాలో మెల్లగా చిచ్చు రేపుతోంది. మినియాపోలీస్ లో ప్రారంభమైన అల్లర్లుడెట్రాయిట్ నగరానికి  వ్యాపించాయి. రాత్రి కర్ఫ్యూను కూడా ఉల్లంఘించి ఆందోళనకారులు ఈ నగరాల్లో హింసాకాండకు దిగారు. డెట్రాయిట్ లో శనివారం ఉదయం నిరసనకారుల గుంపు మీద ఓ అజ్ఞాత వ్యక్తి జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ళ యువకుడు మరణించాడు. హింస, అల్లర్లు శృతి మించుతుండడంతో అధ్యక్షుడు ట్రంప్ అప్రమత్తమయ్యారు. నాలుగు గంటల్లో మినియాపొలీస్ కి చేరుకోవాలని నార్త్ కెరొలినా, న్యూయార్క్ లో ఉన్న సైనిక సిబ్బందిని ఆదేశించారు. 1992 లో నల్లజాతీయుడైన రోడ్నే కింగ్ ను పోలీసులు సుమారు 15 నిముషాలసేపు అదేపనిగా కొట్టడంతో అతడు జీవచ్చవంలా  మిగిలిన విషయం గమనార్హం. నాడు చెలరేగిన అల్లర్లను అణచివేసేందుకు నాటి అధ్యక్షుడు తన అధికారాల మేరకు సైన్యాన్ని రంగంలోకి దించాడు. ఇన్నేళ్ల తరువాత ట్రంప్ కూడా ఇదే పని చేశారు.

ఇలా ఉండగా అమెరికాలో న్యూయార్క్, బ్రూక్లిన్, కెంటకీ, టెక్సాస్, అట్లాంటా, జార్జియా, మిచిగాన్, పోర్ట్ ల్యాండ్ వంటి నగరాల్లో ఘర్షణకారులు రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలో వారు ఓ బ్యాంకుకు, పోర్ట్ ల్యాండ్ లో పోలీసు వాహనానికి, ఇంకా పలు చోట్ల షాపులు, ఇతర భవనాలకు నిప్పు పెట్టారు. వీరిని అదుపు చేసేందుకు వైట్ హౌస్ తాత్కాలికంగా లాక్ డౌన్ ప్రకటించింది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?