తెలంగాణలో అమెరికా అధ్యక్షుడి విగ్రహం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భారత్‌లోనూ వీరాభిమానులు ఉన్నారు. సామాన్య ప్రజలు దేవుళ్లను పూజించినట్లే జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన కృష్ణ ట్రంప్‌ను దేవుడిలాగా ఆరాధిస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అగ్రరాజ్య అధ్యక్షుడంటే దేవుడి కంటే ఎక్కువని బదులిస్తాడు. అతడి అభిమానానికి గుర్తుగా శుక్రవారం ట్రంప్ పుట్టినరోజు కావడంతో ఏకంగా తన ఇంటి వద్ద ట్రంప్ విగ్రహాన్నే నెలకొల్పాడు. గ్రామస్తులకు అన్నదానం ఏర్పాటు చేసి.. ట్రంప్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాడు. ట్రంప్ పై తనకున్న అభిమానంతో గతంలో […]

తెలంగాణలో అమెరికా అధ్యక్షుడి విగ్రహం
Follow us

|

Updated on: Jun 15, 2019 | 1:09 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భారత్‌లోనూ వీరాభిమానులు ఉన్నారు. సామాన్య ప్రజలు దేవుళ్లను పూజించినట్లే జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన కృష్ణ ట్రంప్‌ను దేవుడిలాగా ఆరాధిస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అగ్రరాజ్య అధ్యక్షుడంటే దేవుడి కంటే ఎక్కువని బదులిస్తాడు. అతడి అభిమానానికి గుర్తుగా శుక్రవారం ట్రంప్ పుట్టినరోజు కావడంతో ఏకంగా తన ఇంటి వద్ద ట్రంప్ విగ్రహాన్నే నెలకొల్పాడు. గ్రామస్తులకు అన్నదానం ఏర్పాటు చేసి.. ట్రంప్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాడు. ట్రంప్ పై తనకున్న అభిమానంతో గతంలో రక్తదానాలు కూడా చేశాడు.