అమెరికా ప్రతినిధుల సభలో అంతా గందరగోళం, రక్షణ కోసం ఎంపీల పరుగులు, గ్యాస్ వదిలారారంటూ రూమర్లు

అమెరికా ప్రతినిధుల సభలో పెద్దఎత్తున గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు వేలాదిమంది బ్యారికేడ్లను తోసుకుంటూ...

అమెరికా ప్రతినిధుల సభలో అంతా గందరగోళం, రక్షణ కోసం ఎంపీల పరుగులు, గ్యాస్ వదిలారారంటూ రూమర్లు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 07, 2021 | 11:02 AM

అమెరికా ప్రతినిధుల సభలో పెద్దఎత్తున గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు వేలాదిమంది బ్యారికేడ్లను తోసుకుంటూ కేపిటల్ గ్రౌండ్స్ తూర్పు భాగం వైపు దూసుకువచ్చారు. కొందరి చేతుల్లో అమెరికా జాతీయ పతాకాలు, మరికొందరి చేతుల్లో ట్రంప్ చిత్రంతో కూడిన బ్యానర్లు కనిపించాయి. పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. వేలమంది చొచ్ఛుకుని వస్తున్నారని, తాము భవనం సెక్యూరిటీని కాపాడుతున్నామని హౌస్ మార్షల్స్ అధికారి పాల్ ఇర్వింగ్ ఫోన్ లో ప్రకటించారు. కొన్ని నిముషాలకే ఈ హెచ్ఛరికను ఖాతరు చేయకుండా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, తన సహచర సభ్యులతో కలిసి సెనేట్ ఛాంబర్ నుంచి బయటకి వచ్ఛేశారు. హౌస్ ని, సెనేట్ ని కలిపే వలయకార రోటుండా  పైకి ఆందోళనకారులు, ట్రంప్ మద్దతుకారులు ఎక్కి నినాదాలు చేయడం, వీరితో పెద్ద సంఖ్యలో మరింతమంది వచ్చి చేరడంతో కనీవినీ ఎరుగని పరిస్థితి నెలకొంది. మీ సీట్లలోనే కూర్చుని ఉండాలని, అయితే ఖాళీ చేసేందుకు రెడీగా ఉండాలని కూడా కొందరు అధికారులు కేకలు పెట్టారు. అన్ని డోర్లను మూసివేశారు.

కేపిటల్ రోటుండా లోకి ఏదో గ్యాస్ వదిలారని, అందువల్ల సభ్యులంతా తమ సీట్ల కింద గల గ్యాస్ మాస్కులు ధరించాలని వార్నింగులు వచ్చాయి. అధ్యక్షుడు సాధారణంగా సభలోకి ప్రవేశించే ద్వారం నుంచి ఎవరూ దూసుకురాకుండా చూసేందుకు సెక్యూరిటీ  సిబ్బంది అక్కడ చెక్కబల్లలను ఉంచడం విశేషం. సెకండ్ ఫ్లోర్  గ్యాలరీలోని  రిపోర్టర్లకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. వారు కూడా పరుగులు తీయకతప్పలేదు. ఆఫీస్ బిల్డింగ్ లోకి  దారి తీసే టనెల్ లోకి కొంతమంది ఎంపీలు ప్రవేశించారు. సెక్యూరిటీ సిబ్బందిలో  కొంతమంది తమ ఆటోమాటిక్ గన్ లను ఎంపీల పైకి ఎక్కుపెట్టారు. Also read :మాస్టర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.! జనవరి 1న అఫీషియల్ ప్రకటన.. రికార్డులు తిరగ రాయడం ఖాయమంటున్న ఫ్యాన్స్.. Read more :Donald Trump Supporters: ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంపే విజేత, వాషింగ్టన్ లో వేలాది మద్దతుదారుల భారీ ప్రదర్శన, పోలీసులతో ఘర్షణ

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??