అమెరికాలో పేట్రేగిన గన్ కల్చర్.. రెండు రోజుల్లో 32 మంది హతం

ఈ నెల 4  న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ వైపు సంబరాలు జరుగుతుండగా.. మరోవైపు కాల్పులతో షికాగో, న్యూయార్క్ వంటి నగరాలు  దద్ధరిల్లాయి. షికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో..

అమెరికాలో పేట్రేగిన గన్ కల్చర్.. రెండు రోజుల్లో 32 మంది హతం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 06, 2020 | 1:39 PM

ఈ నెల 4  న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ వైపు సంబరాలు జరుగుతుండగా.. మరోవైపు కాల్పులతో షికాగో, న్యూయార్క్ వంటి నగరాలు  దద్ధరిల్లాయి. షికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో 14 మంది మృతి చెందగా 77 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సౌత్ కెరొలినా లోని  ఓ నైట్ క్లబ్ లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా ఎనిమిది మంది గాయపడ్డారు.  న్యూయార్క్ నగరంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 37 మంది గాయపడ్డారు. నిన్న మన్ హటన్ లో ఓ దుండగుడి ఫైరింగ్ లో 14 ఏళ్ళ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా వేర్వేరు ఘటనలకు కారకులైన ఈ రాష్ట్రాల గవర్నర్లపై అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. వారిపై చర్య తీసుకోవడానికి వెనుకాడబోమని ట్వీట్ చేశారు. పెరుగుతున్న గన్ కల్చర్ కి పరోక్షంగా మీరే బాధ్యులని ఆయన దుయ్యబట్టారు.

గత మే 25 న నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల అమానుష కాండకు బలైన నేపథ్యంలో అమెరికాలో ఆందోళనకారులు ఇప్పటికీ నిరసనలు జరుపుతున్నారు.. ఆందోళనకారులు ఏకంగా వైట్ హౌస్ ముట్టడికే సమాయత్తమయ్యారు. నల్ల జాతీయుల్లో కొందరు శ్వేత జాతీయులపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుండడమే ఈ తాజా ఘటనలకు కారణమని భావిస్తున్నారు. అయితే ఈ సంఘటనల్లో ఎంతమంది శ్వేత జాతీయులు, లేదా ఎంతమంది నల్లజాతీయులు మరణించారన్నది తెలియడంలేదు.