‘ఆయన తనను ఇన్-ఛార్జ్ గా కూడా చెప్పుకోలేరు’..ట్రంప్ పై పరోక్షంగా ఒబామా ధ్వజం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మళ్ళీ ధ్వజమెత్తారు. అయితే నేరుగా ట్రంప్ పేరు పెట్టి ప్రస్తావించకుండా.. 'అనేకమంది తమను ఇన్-చార్జీలుగా చెప్పుకుంటున్నా.. తామేం చేస్తున్నదీ వారికే తెలియదని' ఒబామా అన్నారు..

'ఆయన తనను ఇన్-ఛార్జ్ గా కూడా చెప్పుకోలేరు'..ట్రంప్ పై పరోక్షంగా ఒబామా ధ్వజం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 17, 2020 | 11:41 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మళ్ళీ ధ్వజమెత్తారు. అయితే నేరుగా ట్రంప్ పేరు పెట్టి ప్రస్తావించకుండా.. ‘అనేకమంది తమను ఇన్-చార్జీలుగా చెప్పుకుంటున్నా.. తామేం చేస్తున్నదీ వారికే తెలియదని’ ఒబామా అన్నారు. నల్లజాతి విద్యార్థుల కాలేజీలో జరిగిన  గ్రాడ్యుయేషన్ సెరిమనీలో పాల్గొన్న ఆయన.. అసలు తమను ఒక స్థాయి నేతలుగా చెప్పుకుంటున్న వారికి ఆ అర్హత కూడా లేదన్నారు. దేశంలో హెల్త్ క్రైసిస్ జాతి వివక్షను ఎలా ప్రభావితం చేస్తోందో ఆయన చెప్పుకొచ్చారు. జార్జియాలో ఫిబ్రవరి 23 న పాతికేళ్ల ఓ నల్లజాతి విద్యార్థిని కాల్చి చంపిన ఘటనను ఒబామా ప్రస్తావించారు. బ్లాక్ పీఫుల్ అమెరికాలో తీవ్ర జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశంలో కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానం చాలా డిజాస్ట్రరస్ గా ఉందని ఒబామా ఇటీవలే ఆరోపించారు. అదే సమయంలో.. ఈ నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ కి మద్దతు ఇవ్వాలని ఒబామా తన సహచరులకు  పిలుపునిచ్చారు.