ఇస్రో యాంత్రిక్స్‌ కార్పొరేషన్‌కు గట్టి షాక్.. రూ.8.9వేల కోట్ల ఫైన్ వేసిన అమెరికా కోర్టు

అమెరికా న్యాయస్థానంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు గట్టి షాక్ ఇచ్చింది. గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు భారీ జరిమానా విధించింది.

ఇస్రో యాంత్రిక్స్‌ కార్పొరేషన్‌కు గట్టి షాక్.. రూ.8.9వేల కోట్ల ఫైన్ వేసిన అమెరికా కోర్టు
Follow us

|

Updated on: Oct 30, 2020 | 2:00 PM

అమెరికా న్యాయస్థానంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు గట్టి షాక్ ఇచ్చింది. గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు భారీ జరిమానా విధించింది. దీంతో ఆ సంస్థకు చెందిన వ్యాపార విభాగమైన యాంత్రిక్స్‌ కార్పొరేషన్‌ ఇప్పుడు 1.2 బిలియన్‌ డాలర్లు అంటే రూ.8.9వేల కోట్లు పరిహారంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. యాంత్రిక్స్‌ సంస్థ 2005లో దేవాస్‌ మల్టీమీడియా సంస్థతో ఉన్న ఒక ఒప్పందం రద్దు చేసుకోవడంపై అమెరికా న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

2005లో రెండు ఉపగ్రహాలకు సంబంధించి యాంత్రిక్‌- దేవాస్‌ సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. యాంత్రిక్స్‌ రెండు ఉపగ్రహాలను తయారు చేసి వాటిని అంతరిక్షంలోకి ప్రయోగించాలని దేవాస్ డీల్ కుదుర్చుకుంది. వాటి నిర్వహణ బాధ్యత కూడా యాంత్రిక్సే చూసుకోవాలని పేర్కొంది. వీటి నుంచి ఎస్‌ బ్యాండ్‌లోని 70 మెగాహెర్ట్జ్‌‌ స్పెక్ట్రంను దేవాస్‌కు ఇవ్వాలి. అయితే, ఆ తర్వాత ఈ ఒప్పందానికి సంబంధించి భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ డీల్ ను 2011లో రద్దు చేసుకొన్నారు. దీనిపై దేవాస్‌ సంస్థ భారత్‌లోని సుప్రీం కోర్టుతో సహా వివిధ న్యాయస్థానాలను ఆశ్రయించింది.

ఇస్రోకు చెందిన మాజీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన దేవాస్‌ మల్టీమీడియాలో అమెరికాకు చెందిన వెంచెర్‌ క్యాపిటలిస్టుల పెట్టుబడులు పెట్టారు. ఈ నేపథ్యంలో 2018 సెప్టెంబర్‌లో అమెరికాలోని వాషింగ్టన్‌ వెస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో కేసు దాఖలైంది. మూడు అంతర్జాతీయ ట్రైబ్యూనళ్లు, తొమ్మిది ఆర్బటరీ సంస్థలు ఈ ఒప్పందం రద్దును తప్పుబట్టినట్లు దేవాస్‌ పేర్కొంది. అదే ఏడాది నవంబర్‌లో న్యాయపరిధి కారణాలతో ఆ కేసును కొట్టివేయాలని యాంత్రిక్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇందుకు అమెరికా న్యాయస్థానం తిరస్కరించింది. ఇది తమ పరిధిలోకి కూడా వస్తుందని పేర్కొంది. ఆ తర్వాత ఈ అంశంపై వాదనలు విన్న న్యాయస్థానం 562.5 మిలియన్‌ డాలర్లు పరిహారం దేవాస్‌కు చెల్లించాలని యాంత్రిక్స్‌ను ఆదేశించింది. అంతేకాదు.. దానిపై వడ్డీలెక్కగట్టి మొత్తం 1.2 బిలియన్‌ డాలర్లు (రూ.8.9వేల కోట్లు) చెల్లించాలని అక్టోబర్‌ 27న న్యాయమూర్తి థామస్‌ ఎస్‌ జిల్లీ తీర్పును వెలువరించారు.

టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!