ఆ పోలీసోడిపై థర్డ్ డిగ్రీ మర్డర్ ఆరోపణ.. అరెస్ట్

అమెరికాలో ఓ నల్లజాతీయుడిని పొట్టన బెట్టుకున్న ఓ పోలీసోడు అరెస్టయ్యాడు. అతడిపై థర్డ్ డిగ్రీ మర్డర్ ఆరోపణ మోపిన పోలీసులు కస్టడీలోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. జార్జ్ ఫ్లాడ్ అనే  ఆఫ్రికన్ అమెరికన్ ఏ నేరం చేశాడో గానీ మినియాపొలీస్.. పోలీసులు అతడి పెడరెక్కలు విరిచికట్టి వీధిలో కిందపడేశారు. ముగ్గురు పోలీసులు చోద్యం చూస్తుండగా.. డెరెక్ చౌవిన్ అనే మరొకడు జార్జ్ శరీరంపై తన బరువంతా మోపి అతడి మెడపై కాలు తొక్కి పెట్టి ఉంచాడు. తనకు […]

ఆ పోలీసోడిపై థర్డ్ డిగ్రీ మర్డర్ ఆరోపణ.. అరెస్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 30, 2020 | 2:52 PM

అమెరికాలో ఓ నల్లజాతీయుడిని పొట్టన బెట్టుకున్న ఓ పోలీసోడు అరెస్టయ్యాడు. అతడిపై థర్డ్ డిగ్రీ మర్డర్ ఆరోపణ మోపిన పోలీసులు కస్టడీలోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. జార్జ్ ఫ్లాడ్ అనే  ఆఫ్రికన్ అమెరికన్ ఏ నేరం చేశాడో గానీ మినియాపొలీస్.. పోలీసులు అతడి పెడరెక్కలు విరిచికట్టి వీధిలో కిందపడేశారు. ముగ్గురు పోలీసులు చోద్యం చూస్తుండగా.. డెరెక్ చౌవిన్ అనే మరొకడు జార్జ్ శరీరంపై తన బరువంతా మోపి అతడి మెడపై కాలు తొక్కి పెట్టి ఉంచాడు. తనకు ఊపిరి ఆడడం లేదని, వదిలేయాలని జార్జ్ అతి కష్టం మీద వేడుకున్నా ఆ కసాయి పోలీసు వదలలేదు. 5 నిముషాలపాటు గిలగిలా కొట్టుకున్న జార్జ్ ప్రాణాలు వదిలాడు. వీడియోలో ఈ రాక్షస కాండను చూసిన అనేకమంది డెరెక్ ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మినియాపొలిస్ లో ఆందోళనకారులు రెచ్చిపోయి.. కొన్ని షాపులను ధ్వంసం చేశారు. ఓ పోలీసు స్టేషనుకు నిప్పు పెట్టారు. చివరకు వీరి ఆందోళనతో ప్రభుత్వం డెరెక్ ని అరెస్టు చేసింది. అమెరికాలో జాత్యహంకారం ఇంకా జడలువిప్పి నృత్యం చేస్తోంది. నల్ల జాతీయుల మీద జాత్యహంకారులు చెలరేగిపోతున్నారు.