‘రెమ్‌డిసివిర్’ ఉత్పత్తిలో.. మెజారిటీ వాటాను కొనేసిన అమెరికా..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఈ మహమ్మారి కట్టడికోసం వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. క‌రోనా చికిత్స‌లో రెమ్‌డిసివిర్ ఔష‌ధం మెరుగ్గా ప‌నిచేస్తున్న విష‌యం విదితమే.

'రెమ్‌డిసివిర్' ఉత్పత్తిలో.. మెజారిటీ వాటాను కొనేసిన అమెరికా..
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2020 | 11:57 AM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఈ మహమ్మారి కట్టడికోసం వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. క‌రోనా చికిత్స‌లో రెమ్‌డిసివిర్ ఔష‌ధం మెరుగ్గా ప‌నిచేస్తున్న విష‌యం విదితమే. కాగా.. ఈ ఔష‌ధాన్ని అమెరికా సొంతం చేసుకున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్ప‌త్తి అవుతున్న ఈ ఔష‌ధాల‌ను మొత్తం ఆ దేశ‌మే కొనేసింది. రెమ్‌డిసివిర్‌తో అమెరికా అసాధార‌ణ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా అయ్యే ఆ ఔష‌ధాల‌ను త‌మ‌కే ఇవ్వాల‌ని డోనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వం డీల్ కుదుర్చుకున్న‌ది.

గిలీడ్ సైన్సెస్ అనే సంస్థ ఈ ఔష‌ధాన్ని త‌యారు చేస్తోంది. ఈ ఔష‌ధం వాడిన వారు చాలా వేగంగా కోవిడ్ నుంచి కోలుకుంటున్న‌ట్లు తేలింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమ‌న్ స‌ర్వీసెస్ శాఖ ఓ ప్ర‌క‌ట‌నలో.. రెమ్‌డిసివిర్‌ను ఉత్ప‌త్తి చేసే గిలీడ్ సంస్థ‌తో ట్రంప్ స‌ర్కార్ అద్భుత‌మైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌ట్లు పేర్కొంది. జూలైలో జ‌రిగే వంద శాతం ఉత్ప‌త్తిని అంటే సుమారు 5 ల‌క్ష‌ల డోస్‌ల‌ను త‌మ‌కే ఇవ్వాల‌ని గిలీడ్‌తో అమెరికా డీల్ చేసుకున్న‌ది. ఆగ‌స్టులో 90 శాతం, సెప్టెంబ‌ర్‌లో 90 ఔష‌ధ స‌ర‌ఫ‌రాను కూడా త‌మ‌కే ఇవ్వాల‌ని ట్రంప్ స‌ర్కార్ గిలీడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ది.