Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

బర్త్ టూరిజానికి చెక్.. గర్భిణీలకు అమెరికా ‘నో’ ఎంట్రీ!

US Birth Tourism, బర్త్ టూరిజానికి చెక్.. గర్భిణీలకు అమెరికా ‘నో’ ఎంట్రీ!

అమెరికాలో అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే కోవలో బర్త్ టూరిజానికి చెక్ పెడుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులు విదేశీయులు అయినప్పటికీ.. అమెరికాలో పుట్టిన ప్రతీ బిడ్డకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. ఇక ఈ నిబంధన ఎప్పటినుంచో ఉంది.

ఈ క్రమంలోనే తమకు పుట్టబోయే బిడ్డకు అగ్రరాజ్య పౌరసత్వం రావాలన్న ఉద్దేశంతో వందలాది మంది గర్భిణీ స్త్రీలు ప్రతీ ఏటా ప్రసవం కోసం పర్యాటక వీసా మీద అమెరికా పయనం అవుతారు. ఇక ఇది ఓ పెద్ద వ్యాపారంలా మారిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బర్త్ టూరిజానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

గర్భిణీలు ఇకపై టూరిజం వీసాతో రాకుండా ఉండేందుకు కఠినతరమైన నిబంధనలను అమలులోకి తెస్తున్నట్లు  తెలిపారు. ఇక ఈ కొత్త రూల్స్ శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. అయితే ప్రసవం కోసం వస్తున్నామని.. అంతేకాకుండా వైద్య పరీక్షల నిమిత్తం అవసరమైయ్యే డబ్బులు కూడా తమ వద్ద ఉన్నాయని చూపించిన వారికి మాత్రం ఈ నిబంధనలు వర్తించవని తెలుస్తోంది. అటు వివిధ వ్యాధులకు చికిత్స కోసం వచ్చినవారిని కూడా పరిగణించాల్సి ఉంది. కాగా, ఈ కొత్త నిబంధనలను అమలు చేయడం అంత సులభం కాదని.. ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయని వీసా నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Tags